Joe Biden : సౌదీలో హ‌క్కుల ఉల్లంఘ‌న‌పై ఆందోళ‌న

స్ప‌ష్టం చేసిన అమెరికా చీఫ్ బైడెన్

Joe Biden : అమెరికా దేశాధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సౌదీ అరేబియాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా బైడెన్ ప్రిన్స్ యువ‌రాజుతో కీల‌క భేటీ జ‌రిగింది.

అయితే సౌదీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు బైడెన్(Joe Biden). ఆయ‌న ప్ర‌ధానంగా మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న అనేది ఉండేందుకు వీలు లేద‌న్నారు.

ప్ర‌త్యేకించి దేశంలో అస‌మ్మ‌తివాదుల‌పై జ‌రిగిన దాడుల గురించి ప్ర‌స్తావించారు బైడెన్. గ‌తంలో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌ల‌పై ప‌రిష్కారం చూపుతామంటూ ప్ర‌తిజ్ఞ చేశారని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

ఇస్తాంబుల్ కాన్సులేట్ లో 2018లో సౌదీ జ‌ర్న‌లిస్ట్ జ‌మాల్ ఖ‌జోగ్గీని హ‌త్య చేయ‌డం వెనుక‌ ప్రిన్స్ మొహమ్మ‌ద్ పాత్ర పై ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ్ర‌హం వ్య‌క్తమైంది.

ఇదే విష‌యాన్ని యుఎస్ ఇంటెలిజెన్స్ స‌ర్వీస్ కూడా ప్ర‌స్తావించింది. దీనిపై సౌదీ అధికారులు ప్రిన్స్ మొహ‌మ్మ‌ద్ ప్ర‌మేయాన్ని ఖండించారు.

ఇందులో ఆయ‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని పేర్కొన్నారు. జెడ్డా లోని ఎర్ర స‌ముద్రంలో ప్రిన్స్ మొహ‌మ్మ‌ద్ తో స‌మావేశం అనంత‌రం జోసెఫ్ బైడెన్ మీడియాతో మాట్లాడారు.

ఆయ‌న మ‌రోసారి ఖ‌షోగ్గీ దారుణ హ‌త్య‌ను ప్ర‌స్తావించారు. మొహ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్ త‌దుప‌రి బాధితుడి ర‌క్తం మీ చేతుల‌పై ఉందంటూ జోసెఫ్ బైడెన్ ను ఉద్దేశించి ఖ‌షోగ్గీ భార్య ట్వీట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

చ‌మురు ధ‌ర‌లు త‌గ్గించేందుకు ప్ర‌పంచంలోని అతి పెద్ద ముడి చ‌మురు ఎగుమ‌తిదారుగా ఉంది సౌదీ అరేబియా. దీంతో అమెరికా సౌదీతో స్నేహాన్ని కోరుకుంటోంది.

Also Read : రిషి సున‌క్ రాకుండా జాన్సన్ వ్యూహం

Leave A Reply

Your Email Id will not be published!