Joe Biden Putin : పుతిన్ ను చ‌రిత్ర క్ష‌మించ‌దు

క్షమాప‌ణ చెప్పేది లేద‌న్న బైడెన్

Joe Biden Putin : అమెరికా దేశాధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్ (Ukraine) పై ర‌ష్యా ఏక‌ప‌క్ష దాడిని మొద‌టి నుంచి ఖండిస్తూ వ‌స్తున్నారు.

ఐక్య రాజ్య స‌మితో పాటు యురోపియ‌న్ కంట్రీస్, బ్రిట‌న్, ఫ్రాన్స్ , ఇజ్రాయిల్ ..ఇలా ప్ర‌తి దేశం ర‌ష్యా (Russia) దాడుల్ని ఖండిస్తూ వ‌చ్చాయి. అంతే కాదు వాటిక‌న్ సిటీ పోప్ ఫ్రాన్సిస్ సైతం తాను త‌ట్టుకోలేక పోతున్నాన‌ని, హింసోన్మాదం ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు.

అవ‌స‌ర‌మైతే తాను ప్రోటో కాల్ ను ప‌క్క‌న పెట్టి మాస్కోకు వ‌స్తాన‌ని స్ప‌ష్టం చేశారు. కానీ పుతిన్ (Putin) వినిపించు కోలేదు. ఆర్థిక ఆంక్ష‌లు కంటిన్యూ చేస్తూనే ఉన్నా ర‌ష్యా త‌గ్గ‌డం లేదు.

చివ‌ర‌కు ప్ర‌పంచ కోర్టు యుద్దాన్ని ఆపాల‌ని ఆదేశించినా డోంట్ కేర్ అన్నారు. ఈ త‌రుణంలో అమెరికా దేశాధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్(Joe Biden Putin) చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. ర‌ష్యా (Russia) అధ్య‌క్షుడు పుతిన్ (Putin) ఇంకెంత మాత్రం అధికారంలో ఉండేందుకు త‌గ‌డ‌ని స్ప‌ష్టం చేశాడు.

ఈ వ్యాఖ్య‌లపై తీవ్ర అభ్యంత‌రం తెలిపింది ర‌ష్యా (Russia) స‌ర్కార్. యుద్ధం పేరుతో ఉక్రెయిన్ (Ukraine) పై పుతిన్ చేస్తున్న దుర్మార్గం అంతా ఇంతా కాదంటూ నిప్పులు చెరిగారు బైడెన్. తాను క్ష‌మాప‌ణ చెప్పే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

ర‌ష్యాలో తానేమీ నాయ‌క‌త్వ మార్పు కోర‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఉక్రెయిన్ పై మ‌తి లేని యుద్దంతో పుతిన్ (Putin) ఇప్ప‌టికే ప్ర‌పంచ‌మంత‌టా అంట‌రాని వ్యక్తిగా మారారంటూ ఆరోపించారు.

తాము పుతిన్ (Putin) ను త‌ప్పించేందుకు ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : శ్రీ‌లంక రోద‌న జై శంక‌ర్ ఆవేద‌న

Leave A Reply

Your Email Id will not be published!