Jogi Rajeev: మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడికి బెయిల్ మంజూరు !
మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడికి బెయిల్ మంజూరు !
Jogi Rajeev: అగ్రి గోల్డ్ భూముల కొనుగోలు కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు రాజీవ్ కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రాజీవ్ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీనితో జోగి రాజీవ్ జైలు నుండి విడుదల కానున్నారు.
Jogi Rajeev – మాజీ మంత్రి జోగి రమేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై 3న తీర్పు!
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది. పిటిషన్ పై సెప్టెంబరు 3న తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం తెలిపింది. చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించి తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇదే కేసులో జోగి రమేశ్ రెండు సార్లు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఏమీ తెలియదు, గుర్తులేదని సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారని, మరో సారి విచారణకు పిలిచే అవకాశమున్నట్టు సమాచారం.
Also Read : CM Revanth Reddy: టీ-ఫైబర్ డీపీఆర్ ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరిన రేవంత్ రెడ్డి !