Jogi Ramesh : పవన్ ..బాబుకు జోగి సవాల్
దమ్ముంటే మేనిఫెస్టోలపై చర్చకు రండి
Jogi Ramesh : అమరావతి – ఏపీ మంత్రి జోగి రమేష్ నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు అంత సీన్ లేదన్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఒక్కటైనా జగన్ రెడ్డిని ఢీకొనే సత్తా లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న ఘనత సీఎంకు దక్కుతుందున్నారు. ఇవాళ తాము తీసుకు వచ్చిన పథకాలను కేంద్రం అనుసరిస్తోందని ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు.
Jogi Ramesh Challenge to Pawan and Babu
ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వచ్చే ఈ నాయకులకు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు జోగి రమేష్(Jogi Ramesh). ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ , జనసేన పార్టీలు కేవలం తమ స్వార్థం కోసం మాత్రమే పని చేస్తున్నాయని ఆరోపించారు. తమ పార్టీకి మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్ , ఖురాన్ అని చెప్పారు. మేనిఫెస్టోలపై చర్చించే దమ్ముందా అని సవాల్ విసిరారు జోగి రమేష్.
స్థలం , సమయం మీరే నిర్ణయించండని మీ బండారాన్ని, బాగోతాలను బయట పెడతామని హెచ్చరించారు. సొల్లు కబుర్లు చెబుతూ నిన్నటి దాకా అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన దోపిడీ గురించి జనానికి బాగా తెలుసన్నారు మంత్రి.
జగన్ మోహన్ రెడ్డి అత్యంత జనాదరణ కలిగిన నాయకుడని , వై నాట్ 175 దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత బాబు అండ్ కో చాప దిండు సర్దుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు జోగి రమేష్.
Also Read : Ambedkar Statue : 19న అంబేద్కర్ విగ్రహావిష్కరణ