Jogi Ramesh : పవన్ పిచ్చి కుక్క బాబు గుంట నక్క
నారా లోకేష్ ఓ ఊర పంది అన్న జోగి రమేష్
ఏపీ మంత్రి జోగి రమేశ్(Jogi Ramesh) సంచలన కామెంట్స్ చేశారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను పిచ్చి కుక్క అని ఎద్దేవా చేశారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఓ గుంట నక్క అంటూ మండిపడ్డారు. నారా లోకేష్ ఓ ఊర పంది అంటూ రెచ్చి పోయాడు. సోమవారం జరిగిన సభలో జోగి రమేశ్ నిప్పులు చెరిగారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కష్ట పడుతున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు.
Jogi Ramesh Confidential Lines
ఎంత మంది నాయకులు ఒక్కటై వచ్చినా తమ వైసీపీ చీఫ్ , సీఎంను పీకలేరంటూ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహరహం శ్రమిస్తుంటే లేని పోని ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ఆధారాలు లేకుండా విమర్శలు గుప్పిస్తున్న చంద్రబాబు , పవన్ కు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు జోగి రమేశ్. విద్య, వైద్యం, ఉపాధి, పరిశమ్రల ఏర్పాటులో దేశానికే ఏపీ రాష్ట్రం ఆదర్శ ప్రాయంగా మారిందన్నారు మంత్రి. ఇకనైనా వళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు . ఇంకోసారి నోరు జారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read : Mallikarjun Kharge : మోదీ మౌనం సిగ్గుచేటు – ఖర్గే