CM Revanth Reddy : రేవంత్ కు జోగులాంబ దీవెనలు
ఆశీర్వదించిన పూజారులు
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సీఎంగా బాధ్యతలు చేపట్టారు కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనుముల రేవంత్ రెడ్డి. ఆయన కొలువు తీరిన వెంటనే దూకుడు పెంచారు. తనదైన శైలిలో ముద్ర చేపట్టారు.
CM Revanth Reddy Visit Jogulamba Temple
ఈ సందర్బంగా దేశంలోనే పేరు పొందిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం అమ్మ వారి ఆశీర్వాదం అందజేశారు ఆలయ అర్చకులు, పండితులు. మాజీ ఎమ్మెల్యే , సీనియర్ కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఆధ్వర్యంలో సీఎంను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎనుముల రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. ఆలంపూర్ ఆలయం తరపున రేవంత్ రెడ్డికి(Revanth Reddy) అమ్మ వారి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్దికి చొరవ చూపాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డికి.
ఇదిలా ఉండగా ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా ఉన్నప్పటికీ ఇంకా ఆలయం అభివృద్దికి నోచుకోక పోవడం పట్ల భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఆలయాలను పట్టించు కోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడుతున్నారు.
ఆలంపూర్ ఆలయ అభివృద్దికి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని సూచించారు.
Also Read : Pallavi Prashanth Case : బిగ్ బాస్ విన్నర్ పై కేసు