PM Modi : ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం – మోదీ
మద్దతు ప్రకటించిన ఆస్ట్రేలియా పీఎం
PM Modi Terrorism : ఉగ్రవాదం ప్రపంచానికి సవాల్ విసురుతోంది. ప్రస్తుతం మనందరి ముందున్న లక్ష్యం ఒక్కటే. దానిని ఎదుర్కోవాలంటే ఒక్కరి వల్ల కాదు. అన్ని దేశాలు కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. శనివారం ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ ఆల్బనీస్ తో కలిసి మాట్లాడారు. ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాడేందుకు సిద్దం కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఇరువురు ప్రధానులు అంగీకరించారు.
ఆస్ట్రేలియాలో భారత సమాజానికి భద్రత కల్పించాలని సూచించారు. ఇరు దేశాల నిబంధనలకు యుఎన్ఎసీసీలో నాన్ పర్మనెంట్ సీట్ల అభ్యర్థులకు సంబంధించి మద్దతు ఇచ్చాయి. భారత్, ఆస్ట్రేలియా మొదటి వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పీఎంలు మోదీ, ఆంథోనీ ఆల్బనీస్ మధ్య విస్తృత చర్చలు కొనసాగాయి. ఉగ్రవాద సంస్థలపై సమిష్టి చర్య తీసుకోవడంతో పాటు ఇతర ముఖ్యమైన అంశాలపై ఫోకస్ పెట్టాలని ఇరువురు అంగీకరించారు.
ఇవాళ ప్రపంచం ముందు ఉగ్రవాదం పెను ముప్పుగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ విషయంలో భారత్ సమర్థవంతంగా ఎదుర్కొనేదుకు సిద్దంగా ఉందని హెచ్చరించారు. తాము ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని మరోసారి కుండ బద్దలు కొట్టారు నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi Terrorism).
ఇక నుంచి అన్ని దేశాలు ఉమ్మడిగా పోరాడేందుకు సిద్దం కావాలని కోరారు పీఎం. టెర్రరిస్టుల సరిహద్దు కదలికలను నిలిపి వేసేందుకు అన్ని దేశాలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు పీఎంలు నరేంద్ర మోదీ, ఆంథోనీ ఆల్బనీస్.
Also Read : ఐఐటీల పనితీరు అద్భుతం – ఆల్బనీస్