JP Nadda : ధరణి పేరుతో కేసీఆర్ భూ దోపిడీ
నిప్పులు చెరిగిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
JP Nadda : చేవెళ్ల – కేసీఆర్ కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్లలో ఆదివారం జరిగిన సభలో ప్రసంగించారు. ధరణి పేరుతో భూ దందాకు తెర లేపారంటూ మండిపడ్డారు. దీని వల్ల వేలాది ఎకరాలు మాయం అయ్యాయని ఆరోపించారు. తాము పవర్ లోకి వస్తే కేసీఆర్ సర్కార్ పాల్పడిన అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతామని చెప్పారు.
JP Nadda Comments about Dharani
వేలాది మంది బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణలో ప్రజలు నష్ట పోయారని కేవలం ఒకే ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బల పడిందన్నారు. వేల కోట్లు దోచుకున్నారంటూ ఆరోపించారు జేపీ నడ్డా(JP Nadda). కేవలం ఓట్ల కోసం ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
ప్రాంతీయ పార్టీల అధిపతులు తమ వారసులకు పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా కేసీఆర్ తన కొడుకును సీఎం చేయాలని కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. ఆయన ఆటలు సాగవన్నారు. తిన్నదంతా కక్కిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా మారి పోయిందన్నారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో తాము నిర్ణయాత్మక పాత్రను పోషించ బోతున్నామని జోష్యం చెప్పారు జేపీ నడ్డా.
Also Read : CPI Narayana : నారాయణ షాకింగ్ కామెంట్స్