Judgement Day : ప్రజా తీర్పుపై ఉత్కంఠ
టుడే జడ్జిమెంట్ డే
Judgement Day : తెలంగాణ – రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్నీ గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపాయి.
Judgement Day in Telangana
ప్రధానంగా నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగింది. పలు పార్టీలు బరిలో ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది. మరో వైపు చాలా చోట్ల భారతీయ జనతా పార్టీ , ఎంఐఎం , బీఎస్పీ పార్టీలు ప్రభావం చూపనున్నాయి.
ఇదిలా ఉండగా ఈసారి తెలంగాణ(Telangana) పార్టీతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆదివారం శాసన సభ ఫలితాలు వెలువడనున్నాయి. మిజోరం, చత్తీస్ గఢ్ , మధ్య ప్రదేశ్ , రాజస్తాన్ రాష్ట్రాల ఫలితాలు ఇవాళ ప్రకటిస్తారు. ఆదివారం కేవలం నాలుగు రాష్ట్రాలలో మాత్రమే లెక్కిస్తున్నారు. మిజోరం రాష్ట్రానికి సంబంధించి సోమవారం ఓట్లను లెక్కించనున్నారు.
బీజేపీకి దక్షిణాదిన దారులు పూర్తిగా మూసుకు పోయాయని చెప్పక తప్పదు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ లలో కాంగ్రెస్ పార్టీ కొంత మేర పుంజుకోనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : DK Shiva Kumar : కేసీఆర్ పై డీకే షాకింగ్ కామెంట్స్