Judson Bakka : వెన్నెల గద్ద‌ర్ గెలుపు ప‌క్కా

కాంగ్రెస్ పార్టీ నేత జ‌డ్స‌న్ బ‌క్కా

Judson Bakka : సికింద్రాబాద్ – దివంగ‌త ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ కూతురు వెన్నెల గ‌ద్ద‌ర్ ఈసారి ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు జ‌డ్స‌న్ బ‌క్కా . ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ త‌ర‌పున సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌రిలో నిలిచారు వెన్నెల గ‌ద్ద‌ర్.

Judson Bakka Comment

నిరుద్యోగ స‌మ‌స్య ప‌రిష్కారం కావాలంటే త‌మ పార్టీని గెలిపించాల‌ని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌ని ఆరోపించారు. 2 ల‌క్ష‌ల‌కు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పోస్టు భ‌ర్తీ చేసిన పాపాన పోలేద‌న్నారు. టీఎస్పీఎస్సీ లో అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారిని స‌భ్యులుగా నియ‌మించారంటూ మండిప‌డ్డారు.

ఆరు నూరైనా ప్ర‌జ‌ల నుంచి తీవ్ర‌మైన స్పంద‌న వ‌స్తోంద‌న్నారు జ‌డ్స‌న్ బ‌క్కా(Judson Bakka). త‌న జీవితాంతం ప్ర‌జ‌ల కోసం బ‌తికిన ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ అని అన్నారు. ఆయ‌న ఆత్మ శాంతించాలంటే త‌న కూతురు వెన్నెల‌ను గెలిపించాల‌ని కోరారు.

రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చిన ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు. ల‌క్షా 20 వేల కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసినా ఇవాళ కూలి పోయే స్థితికి చేరుకుందన్నారు జడ్స‌న్ బ‌క్కా.

Also Read : Minister KTR : కొలువుల భ‌ర్తీలో తెలంగాణ టాప్

Leave A Reply

Your Email Id will not be published!