TSNPDCL Jobs : ఎన్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌ ఖుష్ క‌బ‌ర్

ఆప‌రేట‌ర్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్

TSNPDCL Jobs : ఓ వైపు టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భ‌ర్తీలో తీవ్ర జాప్యం జ‌రుగుతుండ‌గా పేప‌ర్ లీకుల వ్య‌వ‌హారం ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. జాబ్స్ రావ‌ని డిసైడ్ అయ్యారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌త్యామ్నాయంగా తెలంగాణ గురుకుల విద్యాల‌యాల సంస్థ‌ల‌లో 9 వేల‌కు పైగా కొలువుల‌కు నోటిఫికేష‌న్ రిలీజ్ అయ్యింది. మ‌రో వైపు విద్యుత్ సంస్థ‌ల‌లో(TSNPDCL Jobs) జూనియ‌ర్ అసిస్టెంట్, ఆప‌రేట‌ర్ క‌మ్ కంప్యూట‌ర్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్ తెలిపాయి. దీంతో జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ .

తాజాగా ఉత్త‌ర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్ ) డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప‌ద్ద‌తి ద్వారా 100 జూనియ‌ర్ అసిస్టెంట్ క‌మ్ కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ప‌చ్చ జెండా ఊపింది. ఇందులో కేవ‌లం 18 జిల్లాల‌కు చెందిన వారే ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 5 శాతం పోస్టుల‌ను ఇత‌రుల‌కు కేటాయించారు. అర్హులైన అభ్య‌ర్థులు ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వ‌రంగ‌ల్ , హ‌నుమ‌కొండ‌, జ‌యశంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, జ‌న‌గామ‌, మ‌హ‌బూబాబాద్ , క‌రీంన‌గ‌ర్ , రాజ‌న్న సిరిసిల్ల‌, పెద్ద‌ప‌ల్లి, జ‌గిత్యాల‌, ఖ‌మ్మం, భ‌ద్రాద్రి కొత్త గూడెం, నిజామాబాద్ , కామారెడ్డి, ఆదిలాబాద్ , మంచిర్యాల‌, నిర్మ‌ల్, కొమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాల‌కు చెందిన 95 శాతం మందికి ఈ జాబ్స్ ద‌క్కుతాయి. ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థులు బీఏ, బీఎస్సీ, బీకామ్ తో పాటు కంప్యూట‌ర్ స‌ర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.

ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు 18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు వ‌య‌స్సు విష‌యంలో 5 ఏళ్ల స‌డ‌లింపు ఉంటుంది. ఇక దివ్యాంగుల‌కు 10 ఏళ్లు, మాజీ సైనిక ఉద్యోగుల‌కు మూడేళ్లు వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. రాత ప‌రీక్ష మే 28న ఉంటుంది.

Also Read : ద‌ళిత బంధు ప్ర‌శంస‌నీయం

Leave A Reply

Your Email Id will not be published!