Jupudi Prabhakar Rao: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమాలు తప్పవు !

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమాలు తప్పవు !

Jupudi Prabhakar Rao: రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కలలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిధ్రం చేస్తుందంటూ వైఎస్సార్‌సీపీ నేత జూపుడి ప్రభాకర్‌(Jupudi Prabhakar Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హయాంలో తెచ్చిన 17 మెడికల్‌ కాలేజీల్ని ఎలా ప్రైవేట్‌ పరం చేస్తారని మండిపడ్డారు.

Jupudi Prabhakar Rao Comment

17 మెడికల్‌ కాలేజీల ద్వారా 5వేల మంది డాక్టర్లు తయారవుతారు. పేదలకు వైద్యాన్ని అందిస్తారు. అలాంటి వైద్యవిద్యను అందించే మెడికల్‌ కాలేజీల్ని ప్రైవేట్‌ పరం చేస్తే పేదలకు వైద్యం ఎవరందిస్తారని ప్రశ్నించారు.

పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వడం మీకు ఇష్టం ఉండదా చంద్రబాబు… మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై డిప్యూటీ సీఎం పవన్ సమాధానం చెప్పాలని. 5వేల మెడికల్ సీట్లను ప్రైవేట్ పరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పేదల తరుఫున తమ పార్టీ పోరాటం చేస్తుందని, అవసరమైతే విద్యార్ధి ఉద్యమం నడుపుతామని చంద్రబాబును హెచ్చరించారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ నందింగ సురేష్‌ను పరామర్శకు వచ్చిన వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలి రావడాన్ని తట్టుకోలేకపోతున్నారు. జనానికి బుద్ధిలేదని విమర్శించే వ్యక్తిని చంద్రబాబునే చూస్తున్నాం. ఊసరవెల్లి లాంటి చంద్రబాబుతో రాజకీయం చేయాలంటే సమాజమే సిగ్గుపడుతోంది. వైఎస్‌ జగన్‌ ఛరిష్మా ఉన్న నాయకుడు. రెడ్ బుక్ పేరు చెబితే భయపడేవాళ్లు ఇక్కడెవరు లేరు. గోదావరి పుష్కరాల్లో ప్రజల ప్రాణాలను బలితీసుకున్న నేరస్తుడు చంద్రబాబు అని జూపుడి ప్రభాకర్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Also Read : Rahul Gandhi : ఇంకెంతకాలం కళ్ళుమూసుకొని ఉంటారంటూ బీజేపీ పై నిప్పులు చెరిగిన రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!