Jurala Project: జూరాలకు భారీగా వరద నీరు ! 12 గేట్లు ఎత్తివేత !

జూరాలకు భారీగా వరద నీరు ! 12 గేట్లు ఎత్తివేత !

Jurala Project : ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల(Jurala Project) జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీనితో అప్రమత్తమైన అధికారులు ఇప్పటివరకు 12 గేట్లు ఎత్తి… దాదాపు 82వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గత 18ఏళ్ల కాలంలో మే నెలలో జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారని పరీవాహక గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

Jurala Project Gates

మరోవైపు, కర్ణాటక, మహరాష్ట్రలలో కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టులో ఈ ఉదయానికి 6,900 క్యూసెక్కుల వరకు ఉన్న వరద నీరు… మధ్యాహ్నానికి 80వేల క్యూసెక్కులకు పెరిగింది. ఈ ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 9.657 టీఎంసీలు. అయితే, మధ్యాహ్నం 3గంటల సమయానికి జలాశయంలో నీటినిల్వ 7.682 టీఎంసీలకు చేరింది. సాయంత్రం అరు గంటలకు వరద 66వేల క్యూసెక్కులకు వరద పెరగటంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

మహారాష్ట్రలోని ఉజని డ్యాం పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా జలాశయంలోకి వరద పోటెత్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గురువారం రాత్రి వరకు జూరాలకు వచ్చే వరద లక్ష క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని జూరాల ప్రాజెక్టు ఈఈ జుబేర్ అహ్మద్‌ తెలిపారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 40 వేల క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,559 క్యూసెక్కులు ఉన్నట్లు తెలిపారు. రేపటి లోపు లక్ష క్యూసెక్కులకు వరద చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు ఉండగా ప్రస్తుత నీటిమట్టం..317.360 మీటర్లు ఉంది. ఈ కారణంగా నేడు స్పిల్ వే గేట్స్ తెరిచే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో జాలర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, మే నెలలో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి.

Also Read : Maoist Hidma Arrested : మావోయిస్టు కీలక నేత కోరాపుట్ పోలీసుల అదుపులో

Leave A Reply

Your Email Id will not be published!