Justice B Sudershan Reddy: ఉప రాష్ట్రపతి పదవికి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

ఉప రాష్ట్రపతి పదవికి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

B Sudershan Reddy : ఉప రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి (B Sudershan Reddy) నామినేషన్‌ దాఖలు చేశారు. తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, శరద్‌ పవార్‌ సహా విపక్ష పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్‌సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌, ఎస్పీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌, డీఎంకే తిరుచ్చి శివ, టీఎంసీ నేత శతాబ్ది రాయ్‌, శివసేన (యూబీటీ) సంజయ్‌ రౌత్‌, సీపీఐ(ఎం) జాన్‌ బ్రిటాస్‌లు ఈ నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 160 మంది ఎంపీలు ఆయనకు మద్దతుగా సంతకాలు చేసినట్లు సమాచారం. నామినేషన్‌ పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్‌ అధికారి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి రశీదును అందజేశారు.

B Sudershan Reddy Submitted Nomination for Vice President

ఈ సందర్భంగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువలపై నిబద్ధత, వినయభావంతో నామినేషన్‌ దాఖలు చేస్తున్నానని అన్నారు. తన జీవితం ప్రజాస్వామ్య సంప్రదాయాలతో ముడిపడి ఉందన్న ఆయన.. ప్రతి వ్యక్తి గౌరవం పైనే భారత్‌ వాస్తవశక్తి ఆధారపడి ఉందన్నారు.
మరోవైపు ఎన్డీయే కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ ఆగస్టు 20న నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఆయన తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. మొత్తం ఎలక్టోరల్‌ కాలేజీ సంఖ్య 781 కాగా మెజార్టీ మార్కు 391. అధికార పక్షానికి 422 మంది సభ్యుల మద్దతు ఉంది.

Also Read : Delhi: ముఖ్యమంత్రిపై దాడి నేపథ్యంలో దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ మార్పు

Leave A Reply

Your Email Id will not be published!