Justice Chandra Ghose Commission: జస్టిస్‌ చంద్రఘోష్ కమిషన్‌ ముందుకు కాళేశ్వరం పంపహౌస్‌ ఇంజినీర్లు !

జస్టిస్‌ చంద్రఘోష్ కమిషన్‌ ముందుకు కాళేశ్వరం పంపహౌస్‌ ఇంజినీర్లు !

Justice Chandra Ghose Commission: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై జస్టిస్‌ చంద్రఘోష్ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. సోమవారం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పంపహౌస్‌ ఇంజినీర్లను జస్టిస్‌ చంద్రఘోష్ కమిషన్‌ విచారించనుంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్‌హౌస్‌ ఇంజినీర్లను కమిషన్‌ ప్రశ్నించనుంది. ఈ మూడు పంప్‌హౌస్‌లకు చెందిన సీఈ నుంచి ఏఈఈల హోదాల్లో పనిచేసే ఇంజినీర్లు సోమవారం కమిషన్‌ ఎదుట హాజరుకానున్నారు. ఇప్పటికే వారు సమర్పించిన అఫిడవిట్లను కమిషన్‌ పరిశీలిస్తోంది.

Justice Chandra Ghose Commission….

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రఘోష్‌ కమిషన్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు వారాల్లోగా అన్నిడాక్యుమెంట్లు అప్పగించాలని స్పష్టం చేసింది. విజిలెన్స్‌, ఎన్డీఎస్‌ఏ నుంచి రిపోర్టులను కోరింది. మరోవైపు, పుణెలోని సీడబ్ల్యూపీఆర్‌కు తమ ప్రతినిధిని పంపించి అధ్యయనం చేయించింది. నిపుణుల కమిటీ నుంచి కూడా కమిషన్‌ నివేదిక కోరింది. అఫిడవిట్ల పరిశీలన తర్వాత నోటీసులు కమిషన్‌ ఇవ్వనుంది.

Also Read : Assam Floods: అస్సాంలో వరదలు ! ఉప్పొంగుతున్న నదులు !

Leave A Reply

Your Email Id will not be published!