Justice DY Chandrachud : స‌హ‌నంతో ఉంటే స‌హించ‌డం కాదు

జ‌స్టిస్ చంద్ర‌చూడ్ షాకింగ్ కామెంట్స్

Justice DY Chandrachud :  భార‌త దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి డీవై చంద్ర‌చూడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌హ‌నంతో ఉండ‌డం అంటే ద్వేషపూరిత ప్ర‌సంగాల‌ను స‌హించడం కాద‌న్నారు.

గుజ‌రాత్ నేష‌న‌ల్ లా యూనివ‌ర్శిటీ లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు. ఇక్క‌డ చ‌దువుతున్న విద్యార్థులు త‌మ స్వంత మ‌న‌స్సాక్షి, స‌మాన‌మైన కార‌ణంతో మార్గ నిర్దేశ‌నం చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇత‌రుల అభిప్రాయాల‌ను అంగీక‌రించ‌డం లేదా గౌర‌వించ‌డం , స‌హించ‌డం అంటే విద్వేష పూరిత ప్ర‌సంగాల‌ను కూడా అంగీక‌రించాల‌ని కాదు అని జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్(Justice DY Chandrachud) పేర్కొన్నారు.

సోష‌ల్ మీడియా ఇవాళ విస్త‌రించింది. ప్ర‌ధానంగా మారింది. ఈ త‌రుణంలో చాలా జాగ్ర‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఈ సామాజిక మాధ్య‌మాల ప్ర‌పంచంలో ప‌రిమిత శ్ర‌ద్ధ‌తో , మ‌నం చేసే ప‌ని దీర్ఘ‌కాలిక ప్ర‌భావాన్ని మాత్ర‌మే క‌లిగి ఉంటుంద‌న్నారు.

రోజూ వారీ ప‌ర‌ధ్యానం గురించి చింతించ కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ ర‌చ‌యిత వోల్టేర్ ను ఇక్క‌డ ప్రత్యేకంగా ప్ర‌స్తావించారు జ‌స్టిస్ చంద్ర‌చూడ్. నువ్వు చెప్పే దానిని నేను అంగీక‌రించ‌ను.

కానీ అది చెప్పే హ‌క్కును నేను గౌర‌విస్తాను అన్న దానిని గుర్తు పెట్టు కోవాల‌న్నారు. తప్పులు చేయ‌డం, ఇత‌రుల అభిప్రాయాల‌ను అంగీక‌రించ‌డం , స‌హించ‌క పోవ‌డం అన్న‌ది ద్వేష పూరిత ప్ర‌సంగానికి వ్య‌తిరేకంగా నిల‌బ‌డ కూడ‌ద‌ని దీని అర్థం కాద‌న్నారు డీవై చంద్ర‌చూడ్.

మెజారిటీ రాజ‌కీయ‌, సామాజిక‌, నైతిక ఘ‌ర్ష‌ణ‌లు పెరుగుతున్న ఈ త‌రుణంలో విద్యార్థులు బాహ్య ప్ర‌పంచంలోకి అడుగు పెడుతున్న‌ప్పుడు వారు త‌మ స్వంత మ‌న‌స్సాక్షి, స‌మాన‌మైన కార‌ణాల ద్వారా మార్గ నిర్దేశ‌ణం చేయాల‌న్నారు.

Also Read : 9 గంట‌ల పాటు వ‌ర్షా రౌత్ విచార‌ణ

Leave A Reply

Your Email Id will not be published!