Justice NV Ramana: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ తో మాజీ సీజేఐ ఎన్వీ రమణ భేటీ

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ తో మాజీ సీజేఐ ఎన్వీ రమణ భేటీ

Justice NV Ramana : ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సమావేశమయ్యారు. దిల్లీలోని ఉపరాష్ట్రపతి అధికార నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ను శాలువాతో సత్కరించి.. తన ప్రసంగాల సంకలన పుస్తకం ‘నేరేటివ్స్‌ ఆఫ్‌ ద బెంచ్‌… ఎ జడ్జ్‌ స్పీక్స్‌’ను జస్టిస్‌ ఎన్‌.వి.రమణ (Justice NV Ramana) అందించారు. 45 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో ఇద్దరూ పలు అంశాలపై చర్చించారు. న్యాయవ్యవస్థలో ఖాళీలు, కేసుల విచారణలో జాప్యానికి కారణాలు, పెండింగ్‌ను పరిహరించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి జస్టిస్‌ ఎన్‌.వి.రమణను ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఆయన హయాంలో జరిగిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల భర్తీ ప్రక్రియ గురించీ తెలుసుకున్నారు. ‘ఇదివరకు నేను రెండుసార్లు ఫోన్‌ లో మీతో మాట్లాడాను. నేనెవరో తెలియకపోయినా మీరు బాగా మాట్లాడారు’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణతో రాధాకృష్ణన్‌ అన్నారు.

Justice NV Ramana – మోదీకి వెండి కానుక

గుజరాత్‌ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం భావ్‌నగర్‌కు చెందిన ఆభరణాల వ్యాపారి జయ్‌భాయ్‌ సోని ఓ ప్రత్యేక కానుకను సిద్ధం చేశారు. స్థానిక ఎంజీ రోడ్డులో ‘మహాశక్తి జెవలర్స్‌’ పేరిట దుకాణం నడుపుతున్న ఈ యువ వ్యాపారి 15 – 20 రోజులు శ్రమించి మోదీ ముఖచిత్రంతో 8 గ్రాముల వెండి ఉంగరాన్ని రూపొందించారు. దీనిపై ‘మోదీకి గ్యారంటీ’ అనే పదబంధంతోపాటు బీజేపీ ఎన్నికల గుర్తు అయిన కమలం పువ్వును చిత్రించారు. అవకాశమొస్తే ప్రధానికి ఈ కానుకను స్వయంగా అందజేస్తానని జయ్‌భాయ్‌ సోని చెబుతున్నారు. గతంలో అయోధ్య రామమందిరం, క్రికెట్‌ ప్రపంచకప్పు ఉంగరాలను కూడా ఈయన తయారుచేశారు.

Also Read : Durga: రూ.300 కోట్ల రూపాయలతో ఖరీదైన దుర్గా మండపం

Leave A Reply

Your Email Id will not be published!