Justice Vijay Sen Reddy : ఫ్యాక్ట్ చెక్ పట్ల అవగాహన అవసరం
జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి కామెంట్
Justice Vijay Sen Reddy : డిజిటల్ మీడియా ప్రభావం అధికంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఫ్యాక్ట్ చెక్ అన్నది అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) న్యాయమూర్తి విజయ్ సేన్ రెడ్డి. తెలుగులో తొలి సారిగా ఫ్యాక్ట్ చెక్ పై జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి, ఫ్యాక్ట్ చెకర్ ట్రైనర్ సత్య ప్రియ బీఎన్ లు కలిసి రాసిన ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా ..చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజంలో సోషల్ మీడియా ప్రభావం పెరిగి పోయిందన్నారు.
Justice Vijay Sen Reddy Fact Check
ఇందులో తప్పుడు సమాచారం ఎక్కువగా ఉంటోందన్నారు. దీనిని ఎలా ఎదుర్కోవాలి, దాని కోసం మనం తెలుసు కోవాల్సిన అంశాలపై ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా అనే పుస్తకం అద్భుతమైన అవగాహన కల్పిస్తుందన్నారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు ఆనందంగా ఉందన్నారు జస్టిస్ రెడ్డి. ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో వాస్తవాలను తనిఖీ చేసే ఒక వ్యవస్థను కలిగి ఉండడం ఎంతో అవసరమన్నారు. దీని పట్ల ఆసక్తి ఉన్న వారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి.
తప్పుడు సమాచారం, నివేదికల వల్ల బాధితులైన వ్యక్తులు ఎక్కువగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారని కానీ ఈ ఫ్యాక్ట్ చెక్ ను తాను మధ్యవర్తిత్వ వ్యవస్థగా తాను భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజా ప్రయోజనాలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఐటీ, పత్రికా చట్టాలకు సంబంధించిన అంశాలను ఇందులో పొందు పర్చారు. అంతర్జాతీయంగా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. కానీ తెలుగులో ఇలాంటిది లేదు. మొట్టమొదటి ఫ్యాక్ట్ చెక్ పుస్తకం ఇదే.
Also Read : BJP Slams Congress : కాంగ్రెస్ వల్లనే దేశం నాశనం – బీజేపీ