Jyotiraditya Scindia : మాన్ మద్యం వివాదంపై సింధియా ఆరా
లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ డేటా తీసుకుంటాం
Jyotiraditya Scindia : ఆమ్ ఆద్మీ పార్టీకి రోజు రోజుకు చిక్కులు వచ్చి పడుతున్నాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇప్పటికే పలుసార్లు మద్యం సేవించి కార్యక్రమాలకు హాజరవుతున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా ఆయన డ్రింక్ తీసుకున్నందుకు ఫ్లైట్ ను ఎక్కకుండా నిలిపి వేశారంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై సదరు ఎయిర్ లైన్స్ క్లారిటీ కూడా ఇచ్చింది.
బీజేపీతో పాటు ప్రతిపక్షాలు పంజాబ్ సీఎంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. తాజాగా ఈ వివాదం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.
దీంతో సీరియస్ గా స్పందించారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా(Jyotiraditya Scindia). భగవంత్ మాన్ డ్రంక్ ఇన్ ఫ్లైట్ ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు.
ఆయన మద్యం సేవించారా లేదా అన్న దానిపై తన మంత్రిత్వ శాఖకు విచారణ చేపట్టాలని ఆదేశించానని స్పష్టం చేశారు. మద్యం సేవించిన వాళ్లకు అనుమతి ఉండదన్నారు.
లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ లో సీఎం ప్రయాణం చేశారు. వారు అందించే నివేదిక మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు సింధియా. ఒక వేళ నిజమని తేలితే వెంటనే చర్యలకు సిఫారసు చేస్తామని పేర్కొన్నారు కేంద్ర మంత్రి.
ఇదిలా ఉండగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ జర్మనీ నుండి తన ఎనిమిది రోజుల పర్యటన ముగించుకుని సోమవారం భారత్ కు వచ్చారు.
అయితే సీఎంను ఫ్రాంక్ ఫర్డ్ విమానాశ్రయంలో ఢిల్లీ వెళ్లే విమానం నుంచి డిఫ్లెంట్ చేశారన్న ఆరోపణలను పరిశీలిస్తామన్నారు జ్యోతిరాదిత్యా సింధియా.
కాగా ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఆప్ కొట్టి పారేసింది. ఫ్లయిట్ డిలే కారణంగా రాలేక పోయారని స్పష్టం చేసింది.
Also Read : కేంద్ర మంత్రి నారాయణ్ రాణేకు జరిమానా