K Annamalai: హిమాలయాలకు తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలై

హిమాలయాలకు తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలై

K Annamalai : భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న కె.అన్నామలై… ఆధ్యాత్మిక పర్యటన కోసం హిమాలయాలకు వెళ్లారు. అక్కడ బాబా గుహలో ఆయన ధ్యానం మొదలుపెట్టారు. పదవీకాలం ముగియడంతో రెండు రోజుల క్రితమే ఆయన బీజేపీ రాష్ట చీఫ్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా నయినార్‌ నాగేందర్‌ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.

K Annamalai to Himalayas

ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే అన్నామలై(K Annamalai) ఆదివారం ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లారు. అక్కడినుంచి ఆయన హిమాలయాలకు వెళ్లారు. తన అధ్యాత్మిక పర్యటనలో భాగంగా, ఆయన బాబా గుహలో ధ్యానం చేపట్టారు. ఈ గుహలోనే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా పలుమార్లు ధ్యానం చేశారు. ఈ పర్యటన ముగించుకుని ఈ నెల 16న అన్నామలై రాష్ట్రానికి చేరుకోనున్నారు. కాగా, అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న అన్నామలైకు బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలను అప్పగించనున్నదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగాసాగుతోంది.

అరివాలయాన్ని తొలగిస్తామన్న అన్నామలై పదవినే పీకేశారు – మంత్రి టీఎం అన్బరసన్‌

డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయ సెంగోల్‌ (రాజదండం)ను తొలగిస్తానన్న అన్నామలై అధ్యక్ష పదవినే పీకేశారని రాష్ట్ర మంత్రి టీఎం అన్బరసన్‌ ఎద్దేవా చేశారు. స్థానిక ఆదంబాక్కంలో సోమవారం జరిగిన అంబేద్కర్‌ 135వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, డీఎంకేను ఎవరు దెబ్బ తీయాలనుకున్నా వారు బాగుపడిన దాఖలాలు లేవన్నారు. తమ సిద్ధాంతాలు, విధి విధానాల్లో తాము స్పష్టంగా ఉన్నామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ఏకమైనా గెలుపు డీఎంకే కూటమిదేనని మంత్రి అన్బరసు వ్యాఖ్యానించారు.

Also Read : Pregnant Woman: విశాఖలో దారుణం ! నిండు గర్భిణి దారుణ హత్య !

Leave A Reply

Your Email Id will not be published!