R Narayana Murthy Viswanath : కళాతపస్వికి మరణం లేదు
ఆర్. నారాయణ మూర్తి
R Narayana Murthy Viswanath : అనారోగ్యంతో కన్ను మూసిన కళాతపస్వి కె. విశ్వనాథ్ కు ఘనంగా నివాళి అర్పించారు దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి. ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకున్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు దర్శకుడు నారాయణ మూర్తి. ఆయన తీసిన చిత్రాలు కలకాలం జీవించే ఉంటాయని పేర్కొన్నారు. కళాతపస్వికి మరణం లేదని, సూర్య చంద్రులు ఉన్నంత కాలం బతికే ఉంటారన్నారు.
కమర్షియల్ మూసలో పడి కొట్టుకు పోతున్న సినిమా రంగంలో సాహిత్యాన్ని, సంగీతానికి ప్రయారిటీ ఇచ్చిన ఘనత కె. విశ్వనాథ్ కే దక్కుతుందన్నారు. ప్రతి సినిమా ఓ కళా ఖండమని కొనియాడారు ఆర్. నారాయణ మూర్తి(R Narayana Murthy). ఆయన లేరన్న వాస్తవాన్ని తాను తట్టుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి మహానుభావులు కొందరే ఉంటారని అన్నారు. ఇవాళ భారత దేశ సినీ రంగానికి కె. విశ్వనాథ్ మరణం తీరని లోటుగా అభివర్ణించారు ఆర్. నారాయణ మూర్తి. ఒక రకంగా తాను ఇష్టపడే, గౌరవించే వారిలో కె. విశ్వనాథ్ ఒకరు అని తెలిపారు దర్శకుడు. వ్యాపారాత్మక ప్రపంచంలో ఒక శంకరా భరణం తీయడం అంటే మామూలు విషయం కాదన్నారు ఆర్. నారాయణ మూర్తి.
సాగర సంగమం, సిరి వెన్నెల, స్వాతి కిరణం, సిరి సిరి మువ్వ..ఇలా ఏ సినిమా తీసినా సాహిత్యాన్ని, సంగీతాన్ని మేలవించేలా ప్రయత్నించారని ఆ మహానుభావుడు ఎక్కడ ఉన్నా బాగుండాలని అన్నారు.
కళాతపస్వి ప్రతి సినిమాలో ఎంతో కొంత జీవితానికి సంబంధించి ఉంటుందన్నారు. ఆయన నుంచి నేర్చు కోవాల్సింది చాలా ఉందన్నారు ఆర్. నారాయణ మూర్తి(R Narayana Murthy).
Also Read : అనిల్ కపూర్ భావోద్వేగం