Kailash Kher Attacked : కర్ణాటక షోలో కైలేష్ ఖేర్ పై దాడి
కన్నడ పాటలు పాడ లేదని ఫైర్
Kailash Kher Attacked : కర్ణాటకలో ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ కు చేదు అనుభవం మిగిలింది. సంగీత కచేరి నిర్వహించారు. ఇందులో భాగంగా పాల్గొన్న సింగర్ కైలాష్ ఖేర్ కేవలం హిందీ పాటలు మాత్రమే పాడాడు. సభికులు , ఫ్యాన్స్ కన్నడ పాటలు పాడాలని కోరారు. అందుకు ఒప్పుకోక పోవడంతో ఆగ్రహంతో బాటిళ్లను కైలాష్ ఖేర్ పైకి విసిరారు.
ప్రమాదవశాత్తు అవేవీ ఆయనకు తగల లేదు. దీంతో బతికి బయట పడ్డాడు గాయకుడు. కేవలం హిందీ పాటలు మాత్రమే పాడితే ఎలా అంటూ నిప్పులు చెరిగారు. విచిత్రం ఏమిటంటే ఇక్కడ కొలువు తీరింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కేంద్రం హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తోంది.
కానీ కన్నడ తో పాటు తమిళనాడు ప్రజలు కూడా పూర్తిగా హిందీని వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉండగా గాయకులపై దాడికి పాల్పడడం ఇది రెండోసారి ఇటీవల . బళ్లారి ఉత్సవాల సందర్భంగా తెలుగు సింగర్ మంగ్లీ పై కూడా కన్నడ పాటలు పాడ లేదంటూ దాడికి యత్నించారు. ఆమె సురక్షితంగా హైదరాబాద్ కు చేరుకుంది.
ఇక తాజాగా కైలాష్ ఖేర్ పై బాటిళ్లతో దాడికి దిగడం కలకలం రేపింది. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం హంపి ఉత్సవ్ ను నిర్వహిస్తోంది. ఇక కైలాష్ ఖేర్ పై(Kailash Kher Attacked) బాటిళ్లను విసిరిన ఘటనలో ఇద్దరు స్థానికులు ప్రదీప్ , సూరా లను అరెస్ట్ చేశారు పోలీసులు. విచారణ చేపట్టారు. పూర్వపు విజయనగర సామ్రాజ్య వాసత్వాన్ని గుర్తు చేసేందుకు కర్ణాటక సర్కార్ నిర్వహించే వార్షిక ఉత్సవం ఇది.
Also Read : రూ. 400 కోట్ల క్లబ్ లో పఠాన్