Kaleshwaram ATM : కాళేశ్వ‌రం ఏటీఎం హ‌ల్ చ‌ల్

నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

Kaleshwaram ATM : తెలంగాణ‌లో ఎన్నిక‌ల ర‌ణ రంగం మొద‌లైంది. నువ్వా నేనా అన్న తీరులో కొన‌సాగుతోంది. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను, బీఆర్ఎస్ నేత‌ల ఆగ‌డాలు, దౌర్జ‌న్యాలు, మోసాలను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త సునీల్ కనుగోలు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. పార్టీ హైక‌మాండ్ వినూత్నంగా ప్ర‌చారం చేప‌డుతోంది. ఇదే స‌మ‌యంలో పార్టీ అభ్య‌ర్థుల‌ను కూడా ఖ‌రారు చేయ‌డంలో ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది.

Kaleshwaram ATM Viral

మొత్తం 119 సీట్ల‌కు గాను 100 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. ఇక ఏఐసీసీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ కీల‌కంగా మారారు. ఆయ‌న విస్తృతంగా తెలంగాణ‌లో స‌భ‌లు, స‌మావేశాల‌లో పాల్గొంటున్నారు. జ‌నంతో నేరుగా క‌లుస్తున్నారు. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా రాహుల్ గాంధీ వైర‌ల్ గా మారారు.

ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధానంగా కేసీఆర్ ను టార్గెట్ చేసింది. రూ. 1,20,000 కోట్ల‌తో నిర్మించిన కాళేశ్వ‌రం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా ప‌ని చేసిందంటూ ఆరోపించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వ‌రం(Kaleshwaram) ఏటీఎంల‌ను ఏర్పాటు చేసింది. దీనిని ట‌చ్ చేస్తే ల‌క్ష కోట్ల అవినీతికి సంబంధించిన చిట్టాతో పోటు ఓ నోటు కూడా ద‌ర్శ‌నం ఇస్తోంది. ఇది సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Also Read : Revanth Reddy : కేసీఆర్ మోసం తెలంగాణ‌కు ద్రోహం

Leave A Reply

Your Email Id will not be published!