Kamal Haasan: కత్తి బహుకరించిన అభిమానిపై కమల్ హాసన్ సీరియస్

కత్తి బహుకరించిన అభిమానిపై కమల్ హాసన్ సీరియస్

Kamal Haasan : ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్ చెన్నైలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కాస్తా సహనం కోల్పోయారు. దీనికి ఓ అభిమాని చూపిన అత్యుత్సాహమే కారణంగా కనిపిస్తోంది. తొలుత అభిమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లోక నాయకుడు కమల్ హాసన్… పరిస్థితి సద్దుమణిగిన తర్వాత మరల అదే అభిమానితో కరచాలనం చేసి అక్కడి నుంచి సాగనంపారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Kamal Haasan Slams

డీఎంకే కూటమి తరఫున తమిళనాడు నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్‌హాసన్ (Kamal Haasan) … చెన్నైలో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. కొందరు అభిమానులు వైదికపైకి వచ్చి… పుష్ఫగుచ్ఛాలు ఇచ్చి కమల్ పట్ల తమ అభిమానం చాటుకున్నారు. అయితే ఒక అభిమాని మాత్రం కమల్‌ కు ఒక కత్తి బహుకరించాడు. కమల్ దానిని అందుకున్నప్పటికీ… కత్తి పైకెత్తాలని అభిమాని పట్టుబట్టాడు. దీనితో అభిమాని తీరుపై కమల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కత్తి కింద పెట్టాలని గట్టిగా చెప్పడంతో అక్కడే ఉన్న పోలీసు అధికారి వెంటనే జోక్యం చేసుకుని ఆ అభిమానితో కత్తి కిందపెట్టేలా చేశారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే కమల్ సదరు అభిమానితో కరచాలనం చేసి నవ్వుతూ అక్కడి నుంచి సాగనంపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Also Read : 11A Seat: విమానంలో ‘11 ఎ’ సీటు స్పెషాలిటీ

Leave A Reply

Your Email Id will not be published!