Kamal Haasan: విజయ్ ర్యాలీపై కమల్ హాసన్ సంచలన కామెంట్స్
విజయ్ ర్యాలీపై కమల్ హాసన్ సంచలన కామెంట్స్
Kamal Haasan : ఇటీవల తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ర్యాలీలకు వస్తున్న జనసంద్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ, ఆ జనం అంతా ఓటర్లుగా మారతారా ? ఇదే ప్రశ్నకు తాజాగా మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ (Kamal Haasan) తనదైన శైలిలో సమాధానమిచ్చారు. రాజకీయ నాయకుడు ఎంత పెద్ద జనసమీకరణ చేసినా, ఆ జనం అంతా ఓట్లుగా మారరని అన్నారు. ఈ విషయం తనకూ, ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్‌కి కూడా వర్తిస్తుందన్నారు. విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ర్యాలీల్లో కనిపిస్తున్న భారీ జనం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు కమల్ ఈ సమాధానం చెప్పారు. మళ్లీ విజయ్ గురించి అని ప్రత్యేకంగా అడిగితే అందరికీ వర్తిస్తే విజయ్ ని ఎలా మినహాయించగలమని కమల్ అన్నారు. భారతదేశంలోని అందరు నాయకులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. జనాలను ఆకర్షించడం వేరు, ఆ జనం ఓట్లుగా మారడం వేరని కమల్ తనదైన శైలిలో స్పష్టం చేశారు.
Kamal Haasan Shocking Comments
విజయ్‌కి (Vijay) రాజకీయాల్లో ఎలాంటి సలహా ఇస్తారని అడిగితే, కమల్ చాలా సింపుల్‌గా సమాధానమిచ్చారు. సరైన మార్గంలో నడవండి, ధైర్యంగా ముందుకు సాగండి, ప్రజలకు మంచి చేయాలని సూచించారు. ఇది నా సలహా. ఇది అందరి నాయకులకూ వర్తిస్తుందన్నారు. రాజకీయాల్లోనే కాదు, సినిమా రంగంలోనూ విమర్శలు సర్వసాధారణమని, కొత్తగా వచ్చే నటులను కూడా చాలామంది విమర్శిస్తారని కమల్ గుర్తు చేశారు.
ఇదిలా ఉంటే విజయ్ ర్యాలీలపై డీఎంకే పార్టీ నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. విజయ్ ర్యాలీల్లో కనిపిస్తున్న జనం ఓట్లుగా మారరని అంటున్నారు. ఈ విమర్శలకు విజయ్ తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చారు. సెప్టెంబర్ 20న తిరువారూర్‌లో జరిగిన ర్యాలీలో విజయ్ జనాలను ఉద్దేశించి, ఈ గుండెలు ఖాళీగా ఉన్నాయా? ఈ జనం ఓట్లు వేయరా? అని అడిగారు. దానికి జనం గట్టిగా విజయ్ అంటూ అరుపులు చేశారు. ఈ సందడి చూస్తే జనం TVKకి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తోంది. విజయ్ ఈ సందర్భంగా జనాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. TVK లక్ష్యం నిజమైన ప్రజాస్వామ్యంతో కూడిన పాలనను తీసుకురావడమేనని పేర్కొన్నారు.
రాజకీయాల్లో జనాలను ఆకర్షించడం ఒక ఎత్తైతే, వాళ్లను ఓట్లుగా మార్చడం మరో ఎత్తు. కమల్ అన్నట్టు, ఈ రూల్ అందరికీ వర్తిస్తుంది. విజయ్ ఈ ఛాలెంజ్‌ని ఎలా అధిగమిస్తాడో చూడాలి మరి. రాజకీయాల్లో కొత్తగా అడుగుపెడుతున్న విజయ్‌కి ఇది ఒక పెద్ద పరీక్షే. దీనిపై మీరు ఏం అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.
Also Read : Bihar Assembly Polls: మూడు విడతల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు
