Kamal Haasan : ఉలగనాయగన్, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ పెద్దల సభకు వెళ్లనున్నట్లు సమాచారం. ఆయనను రాజ్యసభకు పంపాలని మక్కళ్ నీది మయ్యం పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. 2021 శాసనసభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న మక్కళ్ నీది మయ్యం పార్టీకి… రాజ్యసభ(Rajya Sabha) సీటు ఒకటి కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సీటును ఆ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కు కట్టబెట్టడానికి పార్టీ తీర్మాణం చేసినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే జూలైలో ఆయన ఎగువ సభలో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Kamal Haasan will go Rajya Sabha
ఇదే విషయాన్ని తమిళనాడులోని కోయంబత్తూర్ లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో మక్కళ్ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్ వెల్లడించారు. కమల్ హాసన్(Kamal Haasan) ను రాజ్యసభకు పంపాలని పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించిందని చెప్పారు. 2021 శాసనసభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న మక్కళ్ నీది మయ్యం పార్టీకి… రాజ్యసభ సీటు ఒకటి కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. డీఎంకేకు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం జులైలో ముగియనుంది. ఈ క్రమంలో ఒక స్థానం కమల్ హాసన్‌కు ఇచ్చే అవకాశం ఉంది.
కాగా లెజెండరీ యాక్టర్ కమల్‌హాసన్ తీస్తున్న సినిమాలను స్పీడ్‌గా పూర్తి చేస్తున్నారు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘థగ్ లైఫ్’ సినిమాను పూర్తి చేశారు. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే థగ్ లైఫ్ పూర్తి చేసిన వెంటనే కమల్ మరో సరికొత్త ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలు త్వరగా పూర్తి చేసుకుని ఆయన రాజ్య సభ పదవి బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలియవచ్చింది.
Also Read : K Annamalai: హిమాలయాలకు తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలై