Kamal Kaur: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ హత్యలో విస్తుపోయే వాస్తవాలు

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ హత్యలో విస్తుపోయే వాస్తవాలు

Kamal Kaur : పంజాబ్‌లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్(30) హత్యలో విస్తుపోయే నిజాలు వెలుగులోనికి వస్తున్నాయి. గత వారం సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ అయిన కమల్ కౌర్ (Kamal Kaur) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసారు. అనంతరం బతిండా-చండీగఢ్ జాతీయ రహదారిపై ఉన్న ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీ పార్కింగ్ స్థలంలో కారులో కమల్ కౌర్ డెడ్ బాడీని వదిలిపెట్టి వెళ్లిపోయారు. లూథియానా రిజిస్ట్రేషన్‌ నెంబర్ ప్లేటుతో ఉన్న కారు వెనుక సీటులో కౌర్ మృతదేహం పడి ఉంది. కారు నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కమల్ కౌర్ హత్యోదంతం వెలుగులోనికి వచ్చింది. దీనితో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… కారులో గుర్తుపట్టడానికి వీలులేని కమల్ కౌర్ డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు.

Kamal Kaur Murder Mystery

దీనిపై కేసు నమోదు చేసిన విచారణ ప్రారంభించిన పోలీసులు… కమల్ కౌర్ (Kamal Kaur) జూన్ 9న ఇంటి నుండి బయలుదేరి… ఒక ప్రమోషనల్ కార్యక్రమానికి హాజరు కావడానికి బతిండాకు వెళ్తున్నానని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. అప్పటి నుండి ఆమె కనిపించకుండా పోయి, చివరికి శవమై కారులో కుళ్లిపోయిన స్థితిలో కనిపించారు. కాంచన కుమారిగా పేరొందిన కమల్ కౌర్… చిన్నా చితకా బోల్డ్ కంటెంట్‌తో పాటు కొన్ని ఫన్నీ వీడియోస్‌తో నెటిజన్లకు బాగా దగ్గరయ్యారు. కొన్ని పోస్టుల విషయంలో వివాదాలు, విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయితే, ఈ చిన్నపాటి పోస్టులే ఆమెని హత్య చేసేలా చేస్తాయని ఎవ్వరూ ఊహించి ఉండరు కూడా.

కాంచన కుమారిని అమృతపాల్ సింగ్ గ్యాంగ్ హత్య చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో బోల్డ్ కంటెంట్ పోస్ట్ చేస్తుందని… అందుకే చంపేసి శిక్ష విధించినట్లు అమృతపాల్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. పంజాబ్‌లో ఇలాంటి వాటికి ఆస్కారం లేదని… మిగతా వారికీ ఇలాంటి గతే పడుతుందంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు అమృత్ పాల్ సింగ్ మెహ్రాన్ పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలింపు చేపట్టినట్లు ఎస్పీ అమ్‌నీత్ కొండల్ వెల్లడించారు. కాంచన్ కుమారిని నిందితులు గొంతు నులిమి చంపారని… విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

Also Read : Air India Plane Crash: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎయిరిండియా బాధిత కుటుంబం విజ్ఞప్తి

Leave A Reply

Your Email Id will not be published!