Kangana Ranaut : బాలీవుడ్ పై భగ్గుమన్న కంగనా
ముగిసిన ట్విట్టర్ ఖాతా బ్యాన్
Kangana Ranaut : వివాదాస్పద నటిగా పేరొందిన కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె వివాదాస్పద ట్వీట్లు చేయడంలో ట్విట్టర్ కంగనా రనౌత్ ఖాతాపై నిషేధం విధించింది. విధించిన బ్యాన్ నేటితో ముగిసింది. దీంతో ఆనందం వ్యక్తం చేసిన కంగనా రనౌత్(Kangana Ranaut) ఇవాళ మరోసారి బాలీవుడ్ పై నిప్పులు చెరిగింది. ఇక్కడ రాజకీయాలు, ద్వేషం, కోపం, అసూయ, ఈర్ష్య మాత్రమే రాజ్యం ఏలుతోందంటూ ఆరోపించింది. ప్రస్తుతం కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
బాలీవుడ్ పరిశ్రమను కంగనా రనౌత్ టార్గెట్ చేసింది. సినిమా పరిశ్రమ ఇవాళ రెండుగా చీలి పోయింది. ఇప్పుడు కేవలం కరెన్సీ ఆధారంగానే సినిమాలు కొలవబడుతున్నాయని పేర్కొంది. దీని వల్ల అసలైన కళ, నైపుణ్యం, ప్రతిభ, సినిమాకు ఉన్న అర్థం పూర్తిగా మారి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు కంగనా రనౌత్(Kangana Ranaut).
పైకి కనిపించే ముఖాలు వేరు. కానీ లోపల ప్రవర్తించే మనసులు వేరంటూ కుండ బద్దలు కొట్టింది ఈ నటి. ఈ దేశంలో కళాకరులకు కొదువ లేదు. ఎంతో ప్రతిభ కలిగిన వారున్నారు. కానీ వారందరికీ అవకాశాలు రావడం లేదు. కొందరు మాత్రమే తెర పై కనిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు కంగనా రనౌత్.
ఇదిలా ఉండగా టెస్లా సిఇఓ, చైర్మన్ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను కొనుగోలు చేశాక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే కొందరిపై విధించిన నిషేధాన్ని తొలగించాలని ఆదేశించారు ట్విట్టర్ బాస్ ఎలోన్ మస్క్. తాజాగా నటి కంగనా కూడా విముక్తి పొందడం..ఆ వెంటనే ట్వీట్లతో విరుచుకు పడడం కలకలం రేపింది.
Also Read : జనసేనానిపై ఆర్జీవీ సెటైర్