Kanna Lakshmi Narayana TDP : టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న కన్నా
మారనున్న రాజకీయ ముఖ చిత్రం
Kanna Lakshmi Narayana TDP : మాజీ మంత్రి, మాజీ ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ గురువారం తెలుగు దేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. 2 వేల మంది అనుచరులతో ఇవాళ చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. రాజీనామా చేసిన వెంటనే తాను ఏ పార్టీలో చేరబోతున్నాననేది కూడా ప్రకటించారు కన్నా లక్ష్మీనారాయణ.
గుంటూరు జిల్లాలో కన్నాకు మంచి పట్టుంది. ఇదే సమయంలో గన్నవరం లో చోటు చేసుకున్న ఘటనపై కూడా తీవ్రంగా స్పందించారు. నేరుగా ఏపీ ప్రభుత్వాన్ని , దాన్ని నడుపుతున్న సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని మండిపడ్డారు. ఫ్యాక్షనిజం ఎక్కువైందని, పోలీసు రాజ్యం నడుస్తోందంటూ ధ్వజమెత్తారు కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshmi Narayana TDP).
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారంటూ ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే గతంలో కన్నా చంద్రబాబు నాయుడిని అనరాని మాటలు అన్నారు. తనను చంపేందుకు కుట్ర కూడా పన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు అప్పట్లో. కానీ ప్రస్తుతం అదే చంద్రబాబు పంచన చేరడం అందరినీ విస్తు పోయేలా చేసింది.
ఇక ఏపీలో కాపు సామాజిక వర్గం బలమైన వర్గంగా ఉంది. ప్రస్తుతం రాజకీయాలన్నీ దీని చుట్టే తిరుగుతున్నాయి. వైసీపీ సైతం చిరంజీవిని హోల్ట్ లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక బీజేపీ కన్నా లక్ష్మీనారాయణను లైట్ తీసుకుంది. ఆయన వెళ్లినా తమకు ఒరిగేది ఏమీ ఉండదని ప్రకటించింది.
Also Read : నాకు సెక్యూరిటీ కల్పించండి – చీకోటి