Kanna Lakshmi Narayana Joins : టీడీపీలో చేరిన ‘క‌న్నా’

కండువా క‌ప్పి ఆహ్వానించిన బాబు

Kanna Lakshmi Narayana Joins : సుదీర్ఘ రాజ‌కీయ అనుభవం క‌లిగిన నాయకుడు, మాజీ మంత్రి, మాజీ బీజేపీ చీఫ్ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ టీడీపీలో చేరారు. ఆయ‌న‌కు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆ పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు. గుంటూరులోని త‌న నివాసం నుంచి వంద‌లాది వాహ‌నాల్లో భారీ సంఖ్య‌లో అనుచ‌రుల‌తో త‌ర‌లి వ‌చ్చారు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌. మంగ‌ళ‌గిరి లోని టీడీపీ ఆఫీసుకు చేరుకున్నారు. వేయి మందికి పైగా అనుచ‌రులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని సాద‌రంగా ఆహ్వానించారు చంద్ర‌బాబు నాయుడు.

ఈ సంద‌ర్భంగా టీడీపీ చీఫ్ ,మాజీ సీఎం చంద్ర‌బాబు మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇవాళ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ చేరిక‌తో పార్టీకి మ‌రింత బ‌లం వ‌చ్చింద‌ని కొనియాడారు. ఆయ‌న రాక‌తో పార్టీలో జోష్ క‌నిపిస్తోంద‌న్నారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న‌కు అంతం పాడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు మాజీ సీఎం. క‌న్నా(Kanna Lakshmi Narayana Joins) చేర‌డం పార్టీకి శుభ ప‌రిణామ‌మ‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మంత్రిగా ప‌నిచేశారు. రాష్ట్రంలో బ‌ల‌మైన కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం విశేషం. ఆయ‌న బీజేపీకి రాజీనామా చేసిన వెంట‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీలో చేరుతార‌ని అంతా అనుకున్నారు. కానీ ఊహించ‌ని రీతిలో ప‌వ‌న్ తో కాకుండా చంద్ర‌బాబుతో జ‌త క‌ట్టారు.

గ‌తంలో చంద్ర‌బాబు నాయుడిని ఏకి పారేశారు క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌. అయితే క‌న్నా వెళ్లినా త‌మ‌కు న‌ష్టం ఏమీ లేద‌ని బీజేపీ పేర్కొంది.

Also Read : తెలంగాణ‌లో రాష్ట్రప‌తి పాల‌న విధించాలి

Leave A Reply

Your Email Id will not be published!