Kapidhwaj: భారత సైన్యంలో కపిధ్వజ్‌ సేవలు

భారత సైన్యంలో కపిధ్వజ్‌ సేవలు

Kapidhwaj : పర్వతాలు, అడవులు, నదులు, మంచు లోయలు, నీరు, ఎడారులు, చిత్తడి నేలలు… ఇలా ఎక్కడికైనా ఆ వాహనం వెళ్లగలదు. ఇన్ని విభిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే సామర్థ్యమున్న ఈ వాహనం పేరు కపిధ్వజ్‌. ఇటీవలే ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, పంజాబ్‌ వరదల వేళ ఇది వందల మంది ప్రాణాలను కాపాడింది. సహాయక సామగ్రిని చేరవేసింది. మంచుతో కూడిన సియాచిన్, లద్దాఖ్‌ వంటి పర్వత ప్రాంతాలలో కపిధ్వజ్‌తో (Kapidhwaj) భారత సైన్యం ప్రస్తుతం గస్తీ నిర్వహిస్తోంది. చండీగఢ్‌లోని ఈ వాహన తయారీ కర్మాగారం ఉంది.

Kapidhwaj – కపిధ్వజ్ ప్రత్యేకతలు ఇవే !

కపిధ్వజ్‌ను జేఎస్‌డబ్ల్యూ గెక్కో మోటార్స్‌ సంస్థ తయారు చేస్తోంది. దీనిలో వినియోగిస్తున్న 90 శాతానికిపైగా భాగాలు భారత్‌లోనే తయారవుతుండటం విశేషం. ఇప్పటివరకు 120 కపిధ్వజ్‌ వాహనాలను భారత సైన్యం కొనుగోలు చేసింది. కపిధ్వజ్‌లో డ్రైవర్, అసిస్టెంట్‌ డ్రైవర్‌తో పాటు వెనుక భాగంలో ఏడుగురు కూర్చోవచ్చు. సీట్లను తొలగించి, సామగ్రిని నింపుకోవచ్చు. ఈ వాహనం మైనస్‌ 40డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతల్లోనూ సౌకర్యవంతంగా పనిచేయగలదు. వెళుతున్న మార్గానికి అనుగుణంగా కపిధ్వజ్‌ టైర్లలోని గాలిని సర్దుబాటు చేసుకోవాలి. ఇందుకోసం వాహనం నుంచి డ్రైవర్‌ వెలుపలికి రానవసరంలేదు. లోపలే ఉన్న నాబ్‌తోనే ఈ పని పూర్తిచేయవచ్చు. కపిధ్వజ్‌ 360డిగ్రీల కోణంలోనూ తిరుగగలదు. ఈ వాహనం బాడీ కింది భాగం పడవలా ఉంటుంది. దీని టైర్లు నీటిలో తెడ్డులా పనిచేస్తాయి. ఇది డీజిల్‌తో నడుస్తుంది. దీని ఇంధన ట్యాంకు సామర్థ్యం 327 లీటర్లు. దీని ఇంజిన్‌ హార్స్‌పవర్‌ 55. అంబులెన్స్, అగ్నిమాపక వాహన వెర్షన్‌లనూ జేఎస్‌డబ్ల్యూ గెక్కో సంస్థ సిద్ధం చేసింది.

మోటార్లు బోట్లు వెళ్లలేని చోట్లకూ కపిధ్వజ్

‘‘కపిధ్వజ్‌ను ఎడారులు, నదులు, పర్వతాలు, మంచులోయల్లోనూ విజయవంతంగా పరీక్షలు పూర్తిచేశాం. మోటార్‌ బోట్స్, ట్రాక్టర్లు వెళ్లలేని చోట్లకూ కపిధ్వజ్‌ వెళ్లగలదు. అందుకే దీని గురించి పారామిలిటరీ, జాతీయ విపత్తు స్పందన దళంతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం’’ అని జేఎస్‌డబ్ల్యూ గెక్కో మోటార్స్‌ కంపెనీ డైరెక్టర్‌ జస్కీరత్‌ సింగ్‌ మీడియాకు వివరించారు.

Also Read : Puja Khedkar: డ్రైవర్‌ కిడ్నాప్‌ కేసులో తెరపైకి పూజా ఖేడ్కర్‌ పేరు

Leave A Reply

Your Email Id will not be published!