Kapil Sibal Modi : మోదీ చరిత్రను చేర్చండి – కపిల్ సిబల్
ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాల్లో పాఠాలు తొలగింపు
Kapil Sibal Modi : కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్(Kapil Sibal). ఆధునిక భారత దేశ చరిత్ర 2014 నుండి ప్రారంభం కావాలన్నారు. ప్రధాన మంత్రిగా కొలువు తీరిన నరేంద్ర దామోదర దాస్ మోదీ గురించిన చరిత్రను చేర్చాలంటూ ఎద్దేవా చేశారు. దేశం కోసం త్యాగాలు చేసిన వారిని పక్కన పెట్టండి.
నిత్యం విద్వేషాలు, అల్లర్లు, కేసులు, చెరసాలలు, ప్రత్యర్థులపై దాడులు, మతం పేరుతో దారుణాలను పాఠ్య పుస్తకాల్లో చేర్చితే విద్యార్థులు చదువుకుని భావి భారత పౌరులుగా తయారవుతారని ఎద్దేవా చేశారు కపిల్ సిబల్(Kapil Sibal Modi).
బుధవారం ట్విట్టర్ వేదికగా రాజ్యసభ ఎంపీ స్పందించారు. 12వ తరగతి సాంఘిక శాస్త్రాల పాఠ్య పుస్తకాల నుండి కొన్ని భాగాలను తొలగించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. దేశ చరిత్ర మోదీ నుంచి ప్రారంభమైతే బాగుంటుందని సూచించారు.
ఇక తొలగించిన వాటిలో గాంధీ హిందూ ముస్లిం ఐక్యత, ఆర్ఎస్ఎస్ నిషేధం, గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కొన్ని సూచనలు, సమకాలీన భారత దేశంలో సామాజిక ఉద్యమాలుగా మారిన నిరసనలు అంటూ ట్వీట్ చేశారు కపిల్ సిబల్. పాఠ్య పుస్తకాల నుండి ఇప్పటికే మొఘల్ కోర్టుల పాఠాలను తొలగించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Also Read : ఆత్మ పరిశీలన చేసుకోండి – ఆజాద్