Kapil Sibal Amit Shah : అమిత్ షాపై భగ్గుమన్న సిబల్
అల్లర్లు జరగవన్న కామెంట్స్ పై ఫైర్
Kapil Sibal Amit Shah : బీజేపీ పాలనలో ఎలాంటి అల్లర్లు జరగవంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా చేసిన కామెంట్స్ పై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్(Kapil Sibal) నిప్పులు చెరిగారు. కేంద్రంలో కొలువు తీరాక దేశంలో నిత్యం అల్లర్లు, కేసులు, దాడులకు కొదవే లేదని పేర్కొన్నారు. మోదీ పీఎంగా కొలువు తీరాక దేశం అల్లకల్లోలంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మతం , విద్వేష పూరిత రాజకీయాలు చేస్తూ పాలన సాగిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కపిల్ సిబల్.
బీజేపీ హయాంలో మత పరమైన హింస గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని వాపోయారు ఎంపీ. ఇందుకు సంబంధించి శ్రీరామ నవమి సదర్భంగా ససారం, బీహార్ షరీఫ్ పట్టణాల్లో మత పరమైన హింస చెలరేగింది. ఆయన అమిత్ షా చేసిన కామెంట్స్ ను మరో జుమ్లాగా అభివర్ణించారు.
ఇదిలా ఉండగా బీహార్ లోని నవాడా జిల్లా పరిధిలోని హిసువాలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా పై విధంగా వ్యాఖ్యలు చేశారు. 2024లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి పవర్ లోకి రానివ్వండి. 40 సీట్లకు 40 గెలిచేలా సహకరించండి. 2025లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్ట బెడితే మీ భవిష్యత్తుకు ఢోకా ఉండదంటూ పేర్కొన్నారు. దీనిపై కపిల్ సిబల్(Kapil Sibal Amit Shah) మండిపడ్డారు. అమిత్ షాకు రాజకీయాలు చేయడం తప్ప మరొకటి రాదంటూ ఎద్దేవా చేశారు. పూర్తిగా మతం ప్రాతిపదికనే రాజకీయాలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : పీఎం ఎన్నికల కోడ్ ఉల్లంఘన