Kapil Sibal Kejriwal : కేజ్రీవాల్ సమన్లపై సిబల్ ఫైర్
16న ఉదయం రావాల్సిందే
Kapil Sibal Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. ఈ మేరకు ఈనెల 16న తమ ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. ఉదయం 11 గంటలకు రావాలని స్పష్టం చేసింది. దీనిపై సీరియస్ గా స్పందించారు ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్(Kapil Sibal Kejriwal). ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు.
మోదీ ప్రభుత్వం కావాలని ఆప్ చీఫ్, సీఎం కేజ్రీవాల్ ను టార్గెట్ చేసిందని ఆప్ ఆరోపించింది. పనిగట్టుకుని కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడింది. ఇదే సమయంలో సీబీఐ సమన్లు ఇవ్వడంలో తప్పేముందని ప్రశ్నించింది భారతీయ జనతా పార్టీ. అరవింద్ కేజ్రీవాల్ అమాయకుడు ఏమీ కాదని పాలిటిక్స్ లో ఆరి తేరాడంటూ ఎద్దేవా చేసింది.
అవినీతిపై యుద్దం అంటూ ప్రజల్ని నమ్మించాడని, చివరకు లిక్కర్ స్కాంలో అడ్డంగా ఇరుక్కున్నాడంటూ ఆరోపించింది. సీబీఐ, ఈడీ మొత్తం బండారాన్ని బయట పెట్టాయని కానీ తనకేమీ తెలియదని బుకాయించడం విడ్డూరంగా ఉందని పేర్కొంది బీజేపీ. ఈ మొత్తం ఎపిసోడ్ పై కపిల్ సిబల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గత కొంత కాలంగా విపక్షాలను టార్గెట్ చేస్తూ వస్తోందని మండిపడ్డారు.
Also Read : అమిత్ షా కామెంట్స్ టీఎంసీ సీరియస్