Kapil Sibal Modi : దేశం కోసం వాళ్లు ప్రాణాలిచ్చారు
ఇందిర..రాజీవ్ లకు సిబల్ కితాబు
Kapil Sibal Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్. మాజీ, దివంగత ప్రధానమంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలపై నోరు పారేసు కోవడంపై మండిపడ్డారు. ఇదిలా ఉండగా గతంలో కపిల్ సిబల్ కేంద్ర మంత్రిగా రెండు సార్లు పని చేశారు. తాజాగా ఆయన సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర సభ్యునిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.
మోదీ వల్ల దేశానికి నష్టం తప్ప ఎలాంటి లాభం లేదన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారని స్పష్టం చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా స్పదించారు కపిల్ సిబల్. మీరు పుస్తకాల నుంచి చరిత్రను తొలగించ గలరు. కానీ దేశంలోని ప్రజల హృదయాలలో నిలిచి పోయిన ఆ ఇద్దరు ప్రధానులను మరిచి పోకుండా ఎలా ఉండగలరని ప్రశ్నించారు కపిల్ సిబల్(Kapil Sibal Modi).
కులం పేరుతో, మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతూ దేశాన్ని , మనుషులను విభజించే పనిలో బీజేపీ చాలా బిజీగా ఉందని ఆరోపించారు. ఇదిలా ఉండగా ఇందిరా గాంధీ 1984లో సిక్కు తీవ్రవాదులు సెక్యూరిటీ రూపంలో కాల్చి చంపారు. 1991లో తమిళనాడులో ఎల్టీటీఈ చేతిలో దుర్మరణం పాలయ్యారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే లక్ష్యంతో ఇన్సాఫ్ ను ప్రారంభించారు కపిల్ సిబల్.
Also Read : ది కేరళ స్టోరీని ప్రతి ఒక్కరు చూడాలి
