Kapurthala Rail Factory : ‘వందే’ రైళ్ల తయారీలో ఆలస్యం
తయారీలో నిమగ్నమైన కపుర్తలా ఫ్యాక్టరీ
Kapurthala Rail Factory : దేశ వ్యాప్తంగా మోదీ వందే భారత్ రైలును అభివృద్దికి నమూనాగా చెబుతూ వస్తున్నారు. ఇదిలా ఉండగా కేంద్రం ఆశించిన, నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో కొంత ఆలస్యం జరుగుతోందన్న విమర్శలు లేక పోలేదు. 2022-23లో ఒక్క వందే భారత్ రైలును కూడా అందించ లేక పోయింది. రైల్వేకు సంబంధించిన ప్రీమియర్ ప్రొడక్షన్ యూనిట్ , రైల్ కోచ్ ఫ్యాక్టరీ(Rail Coach Factory) ఆశించిన మేర ఇవ్వలేక పోయింది. ఫ్యాక్టరీ లక్ష్యాలను చేరుకోవడంలో వైఫల్యం చెందింది.
ఆగస్టు 2024 నాటికి 75 వందే భారత్ రైళ్లను నడపాలన్న రైల్వే ప్రతిష్టాత్మక ప్రణాళికలను ప్రభావితం చేయగలదని అభిజ్ఞ వర్గాల భోగట్టా. రైల్వే కోచ్ లు కూడా తయారు చేస్తుంది సంస్థ. 2022-23 చివరి నాటికి ఫ్యాక్టరీ ఉత్పత్తిలో పెద్ద లోటును చూసింది. 1,885 లక్ష్యానికి వ్యతిరేకంగా 1,478 కోచ్ లను తయారు చేసింది. 256 తయారు కావాల్సి ఉండగా 153 రైళ్లను మాత్రమే తయారు చేయగలిగింది.
ఇక ఎల్ హెచ్ బీ కోచ్ ల కోసం దాని లక్ష్యం కంటే తక్కువగా 1,530 కి గాను 1,325ని తయారు చేసింది. ఫ్యాక్టరీలో వందే భారత్ రైళ్ల ఉత్పత్తి 2024 నాటికి ప్రారంభం కానుందని అంచనా. ఈ ఏడాది రైల్వే బోర్డు ఆర్సీఎఫ్ కపుర్తలాకు 64 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల లక్ష్యాన్ని ఇచ్చింది. వందే భారత్ రైళ్ల కోసం ఫ్రెంచ్ బహుళ జాతి సంస్థ రోలింగ్ స్టాక్ తయారీదారు ఆల్ స్టోమ్ పంపిన డిజైన్ ను ఆమోదించే ప్రక్రియను ఆర్సీఎఫ్ ఇంకా పూర్తి చేయలేదని మంత్రిత్వ శాఖ ద్వారా తెలిసింది.
Also Read : KTR