Jagadish Shettar Joins : షెట్టర్ షాక్ కాంగ్రెస్ లోకి జంప్
బీజేపీకి మాజీ సీఎం ఝలక్
Jagadish Shettar Joins : భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ రాజీనామా చేశారు. ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని, మంచి పదవి దక్కుతుందని ఆశ పెట్టారు. కానీ పార్టీ నిర్ణయాన్ని బేఖాతర్ చేశారు షెట్టర్. ఊహించని రీతిలో కాషాయానికి కటీఫ్ చెప్పారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే , కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య సమక్షంలో మాజీ సీఎం కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. ఆయన రాక వల్ల తమ పార్టీకి మరింత బలం చేకూరినట్లయిందని పేర్కొన్నారు ఏఐసీసీ చీఫ్.
గత వారం రోజుల్లో బీజేపీ నుంచి చేరిన ప్రముఖుల్లో ఇద్దరు ఉన్నారు. వారిలో లక్ష్మణ్ సవాది కాగా మరొకరు జగదీశ్ షెట్టర్(Jagadish Shettar Joins) ఉన్నారు. ఇక కర్ణాటకలో లింగాయత్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. వారి ఓట్లు కీలకం. వారు ఎటు వైపు మొగ్గుతారో వారే పవర్ లోకి వస్తారు. ముందుగా తీసుకున్న నిర్ణయం మేరకు తన ఎమ్మెల్యే పదవికి, భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రత్యేక హెలికాప్టర్ లో హుబ్బళ్లి నుంచి బెంగళూరుకు వెళ్లారు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు.
ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ , మాజీ సీఎం సిద్దరామయ్య, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. నేను నిర్మించిన పార్టీ నుండి నన్ను బలవంతంగా తొలగించారంటూ జగదీశ్ షెట్టర్ ఆరోపించారు. వివాద రహితుడైన అరుదైన నాయకుడు షెట్టర్ అంటూ కితాబు ఇచ్చారు ఖర్గే.
Also Read : బీజీపీకి మాజీ సీఎం షట్టర్ గుడ్ బై