Revanth Reddy : తెలంగాణ‌లో క‌ర్ణాట‌క సీన్ – రేవంత్

జోష్యం చెప్పిన టీపీసీసీ చీఫ్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించింది. 224 సీట్ల‌కు గాను అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. హంగ్ ఏర్ప‌డుతుంద‌ని జేడీఎస్ కింగ్ మేక‌ర్ గా మారుతుంద‌ని ఆశించిన ఆ పార్టీ చీఫ్ , మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామికి బిగ్ షాక్ ఇచ్చింది కాంగ్రెస్. 136 సీట్లు సాధించి స్ప‌ష్ట‌మైన ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే క‌నీసం 113 సీట్లు కావాల్సి ఉండ‌గా అంత‌కు మించి సీట్లు సాధించి త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది.

ఈ సంద‌ర్భంగా గ్రాండ్ స‌క్సెస్ సాధించ‌డంపై రేవంత్ రెడ్డి స్పందించారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. క‌ర్ణాట‌క ఫ‌లితాలు రాబోయే రోజుల్లో తెలంగాణ‌లో జరిగే ఎన్నిక‌ల్లో వెల్ల‌డి అవుతాయ‌ని, ఇక్క‌డ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొంద‌డం ప‌క్కా అన్నారు. అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన బీజేపీకి ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ది చెప్పార‌ని అన్నారు.

రాష్ట్రంలో అంతులేని అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ అవినీతికి డాన్ గా మారిన దొర కేసీఆర్ కు, బీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మ‌న్నారు. క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు చెప్పారో అదే రీతిన తెలంగాణ ప్ర‌జ‌లు వేచి చూస్తున్నార‌ని ఇక తాము గెల‌వ‌డం ఖాయ‌మ‌న్నారు రేవంత్ రెడ్డి.

Leave A Reply

Your Email Id will not be published!