Ramesh Jarkiholi : ఓటుకు రూ. 6 వేలు ఇస్తాం – బీజేపీ నేత
మాజీ మంత్రి రమేష్ జార్కి హోలి కామెంట్స్
Ramesh Jarkiholi : భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రమేష్ జార్కి హోలి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న ఈ తరుణంలో కాషాయ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓటుకు రూ. 6,000 చెల్లిస్తామంటూ ప్రకటించారు.
వీటిని మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇస్తామన్నారు. ఇదిలా ఉండగా రమేష్ జార్కి హొళి(Ramesh Jarkiholi) చేసిన వ్యాఖ్యలపై రాద్దాంతం చెలరేగడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది భారతీయ జనతా పార్టీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక లోని బెళగావిలో జరిగిన పార్టీ ర్యాలీలో రమేష్ జార్కి హోళి పాల్గొని ప్రసంగించారు.
ఇదిలా ఉండగా ఆయనపై తీవ్ర వివాదానికి దారి తీసింది ఆయన వ్యవహారం. 2021లో లైంగిక కుంభకోణంలో ఆరోపించినందుకు బలవంతంగా రాజీనామా చేశారు రమేష్ జార్ఖి హొళి. ఇదిలా ఉండగా బెళగావిలోని సులేబావి గ్రామంలో ఆయన మద్దతుదారులు భారీ ర్యాలీ చేపట్టారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబాల్కర్ పై మాజీ మంత్రి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె బెలగావి గ్రామీణ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా రమేష్ జార్కి హొళి బెలగావిలోని గోకాక్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె తన నియోజకవర్గంలో ఓటర్లకు కుక్కర్లు, వంట ఉపకరణాలు పంచుతున్నారు.
కానీ మేం రాబోయే ఎన్నికల్లో ఓటుకు రూ. 6 వేలు ఇస్తామని ప్రకటించడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా బీజేపీ హైకమాండ్ మాజీ మంత్రి చేసిన కామెంట్స్ పై సీరియస్ అయ్యింది.
Also Read : హిందూత్వ ప్రయోగశాలగా కోస్తా కర్ణాటక