BJP MLA Son Arrest : బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ. 6 కోట్లు
కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో కలకలం
BJP MLA Son Arrest : ఈ ఏడాది ఏప్రీల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యే కుమారుడు లంచం తీసుకుంటూ పట్టుబడడం కలకలం రేపింది. ఆయన ఇంట్లో ఏకంగా రూ. 6 కోట్ల రూపాయలు దొరికాయి.
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మదాల్ విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ మదాల్(BJP MLA Son Arrest) బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు లో చీఫ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా అడ్డంగా బుక్కయ్యాడు. సోదాలు జరుపగా భారీ ఎత్తున నగదు దొరికిందని శుక్రవారం అధికారులు తెలిపారు.
ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వీటిని ఇక్కడ ఉంచినట్లు సమాచారం. కర్ణాటకకు చెందిన లోకాయుక్త అవినీతి నిరోధక విభాగం రాష్ట్ర అంబుడ్స్ మెన్ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఇంటిపై దాడి చేసింది.
భారీ ఎత్తున నగదు బయట పడింది. అర్ధరాత్రి దాకా సోదాలు కొనసాగాయి. దావణగెరె జిల్లా లోని చన్నగిరికి చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారు మాదాల్ విరూపాక్షప్ప. దేశంలోనే పేరొందిన మైసూర్ శాండల్ సబ్బును తయారు చేసే ప్రభుత్వ యాజమాన్యంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కేఎస్డీఎల్) కి చైర్మన్ గా ఉన్నారు.
ఆయన కుమారుడు చీఫ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. గురువారం రూ. 40 లక్షలు తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు. కార్యాలయంలో రూ. 1.75కోట్ల విలువైన మూడు బ్యాగుల మేర నగదు లభించించిదని వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Also Read : బీజేపీ మిత్రపక్షాల క్లీన్ స్వీప్