Karnataka Election 2023 : క‌న్న‌డ‌నాట బారులు తీరిన ఓట‌ర్లు

224 అసెంబ్లీ స్థానాలు 2,516 మంది అభ్య‌ర్థులు

Karnataka Election 2023 : క‌ర్ణాట‌క‌లో పోలింగ్ కొన‌సాగుతోంది. గతంలో కంటే ఈసారి భారీ ఎత్తున ఓట‌ర్లు త‌మ ఓటు వేసేందుకు బారులు తీరడం విస్తు పోయేలా చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2,516 మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. అత్య‌ధికంగా లింగాయ‌త్ సామాజిక వ‌ర్గంకు చెందిన ఓట‌ర్లే ఉన్నారు. వీరే నిర్ణ‌యాత్మ‌క పాత్ర పోషించ‌నున్నారు.

ఈనెల 13న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే అధికారంలో ఉన్న బీజేపీ మ‌రోసారి ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌ని ధీమాగా ఉంది. ఇక ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం కాషాయానికి అంత సీన్ లేద‌ని , హ‌స్తం హ‌వా కొన‌సాగ‌డం ఖాయ‌మ‌న్నారు క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్.

సీఎం బొమ్మై , మాజీ సీఎంలు సిద్ద‌రామ‌య్య‌, జ‌గ‌దీశ్ షెట్ల‌ర్ , కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ తో పాటు బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్య‌ర్థులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు

పోలింగ్ సంద‌ర్భంగా ఈసీ ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌నుల జ‌ర‌గ‌కుండా గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 58,545 పోలింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం. మొత్తం 42,48,028 కొత్త ఓట‌ర్లు ఓటు వేసేందుకు న‌మోదు చేసుకున్నారు.రాష్ట్రంలో 5.3 కోట్ల మంది ఓట‌ర్లు ఉన్నారు. ఈ విష‌యాన్ని భార‌త ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించింది. ఇందులో 11,71,558 మంది యువ ఓట‌ర్లు కాగా 12,15,920 మంది సీనియ‌ర్ సిటిజ‌న్ ఓట‌ర్లు ఉన్నారు.

Also Read : జేడీఎస్ తో పొత్తు ఉండ‌దు – డీకే

Leave A Reply

Your Email Id will not be published!