Karnataka Ex CM : కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ దుర్మరణం

కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరం....

Karnataka Ex CM : కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన మంగళవారం తెల్లవారుజామున 2.45 గంటలకు స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 1999 నుంచి 2004 వరకు ఎస్ఎం కృష్ణ(S M Krishna) కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. 2004 నుంచి 2009 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేశారు. అనంతరం అంటే 2009లో మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

Karnataka Ex CM Krishna No More..

కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరం.. ఐటీ హబ్‌గా మారడంలో ఎస్ ఎం కృష్ణ(S M Krishna) కీలక పాత్ర పోషించారన్న సంగతి అందరికి తెలిసిందే. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఆయన పని చేశారు. చివరకు అంటే.. 2017లో ఆయన బీజేపీలో చేరారు. అనంతరం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. 2023లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ ప్రకటించింది. 1932, మే1వ తేదీన మాండ్య జిల్లాలోని సోమనహళ్లిలో ఎస్ ఎం కృష్ణ జన్మించారు. మైసూర్‌లోని మహారాజా కాలేజీ నుంచి ఆయన డిగ్రీ పట్టా అందుకోన్నారు. అనంతరం బెంగళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. ఆ తర్వాత ఉన్న విద్య కోసం యూఎస్ వెళ్లారు.

ఆక్రమంలో డల్లాస్‌లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీ, జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను ఆయన అభ్యసించారు. ఆ తర్వాత.. ఆయన తిరిగి భారత్ వచ్చారు. 1962లో మడ్డురు అసెంబ్లీ స్థానం నుంచి ఎస్ఎం కృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అలా కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఆయన అడుగు పెట్టారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ మరణ వార్త విని దిగ్బ్రాంతి చెందానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తమ ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇరు రాష్ట్రాలకు పెట్టుబడులను ఆక్షరించడంలో పోటీ పడినా.. తమ స్నేహం అంతకంటే ఉన్నతమైనదని సీఎం చంద్రబాబు వివరించారు. ప్రజల సంక్షేమానికి నిత్యం ప్రాధాన్యత ఇచ్చిన నిజమైన నాయకుడు ఎస్ ఎం కృష్ణ అని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కష్ట సమయంలో అయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతి తెలియజేస్తున్నానని సీఎం చంద్రబాబు.. తన ఎక్స్ ఖాతా వేదికగా తెలిపారు.

Also Read : Manipur Voilence : ఆ తొమ్మిది జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేత

Leave A Reply

Your Email Id will not be published!