Kavya Maran Viral : కావ్య క‌నిపిస్తే చాలు ఫ్యాన్స్ గ‌గ్గోలు

ఈ ముద్దుగుమ్మ కోసం ఎదురు చూపులు

Kavya Maran Viral : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో మ‌రోసారి త‌ళుక్కున మెరిశారు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ సిఇఓ కావ్య మార‌న్. వేల కోట్ల ఆస్తులు క‌లిగిన స‌న్ మీడియా సంస్థ‌కు ఆమె వార‌సురాలు. ప్ర‌స్తుతం ఆ జ‌ట్టుకు అన్నీ తానే అయి వ్య‌వ‌హ‌రిస్తున్నారు కావ్య మార‌న్(Kavya Maran Viral). ఎప్పుడైతే ఆమె జ‌ట్టును టేకోవ‌ర్ చేసుకుందో ఆనాటి నుంచి నేటి దాకా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు.

ఒక ర‌కంగా చెప్పాలంటే ఐపీఎల్ లో అన్ని జ‌ట్ల‌కు చెందిన ఫ్యాన్స్ అంతా ఈ లేత క‌ళ్ల‌, సోయ‌గాల ముద్దు గుమ్మ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ఇక స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు వ‌చ్చిందంటే చాలు అభిమానులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఆట కంటే ఎక్కువ‌గా కావ్య మార‌న్ పైనే ఫోక‌స్ పెడుతున్నారు.

ఆమె న‌వ్వినా , మాట్లాడినా ఏదైనా సంజ్క్ష‌లు చేసినా ..ఏం చేసినా కావ్య మార‌న్(Kavya Maran) కోసం ఎదురు చూస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ఆమె పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఐపీఎల్ లో ప‌లువురు సినీ తార‌లు ఉన్నా ఆమె ముందు చిన్న బోతున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు కావ్య పాప‌కు ఉన్న క్రేజ్ ఏమిటో.

ఇవాళ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో త‌ల‌ప‌డ‌బోతోంది. ఇక ఫ్యాన్స్ కు పండ‌గ చేసుకోబోయేందుకు రెడీ అయ్యారు. మొత్తంగా కావ్య‌నా మ‌జాకా.

Also Read : క‌ల‌క‌త్తా జోరు హైద‌రాబాద్ హుషారు

Leave A Reply

Your Email Id will not be published!