KC Venu Gopal : రాహుల్ యాత్ర రాజకీయం కోసం కాదు
స్పష్టం చేసిన కాంగ్రెస్ నేత కేసీ వేణు గోపాల్
KC Venu Gopal : న్యూఢిల్లీ – ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారని, జనవరి 14 నుంచి రెండో విడత భారత్ న్యాయ యాత్ర చేపడుతున్నారని చెప్పారు. గతంలో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఇది కొనసాగింపు అని పేర్కొన్నారు కేసీ వేణుగోపాల్.
KC Venu Gopal Praises Rahul Gandhi
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి ప్రారంభిస్తారని పశ్చిమ తీరం దాకా కొనసాగుతుందన్నారు. మార్చి 20న ముంబైలో యాత్ర ముగుస్తుందన్నారు . 14 రాష్ట్రాలు 86 జిల్లాల మీదుగా మొత్తం రాహుల్ గాంధీ 6,200 కిలోమీటర్ల మేర నడుస్తారని తెలిపారు. ఈసారి భారత్ న్యాయ యాత్రను హైబ్రిడ్ పద్దతిన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
బస్సు ద్వారా , అక్కడక్కడా కాలి నడకన ఈ యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు కేసీ వేణుగోపాల్(KC Venu Gopal). అయితే ఇది రాజకీయ యాత్ర కాదని కుండ బద్దలు కొట్టారు. అధికార బీజేపీ చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని ఆరోపించారు .
రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర ప్రజల కోసం చేస్తున్నారని చెప్పారు. దేశంలో కొలువు తీరిన మోదీ సర్కార్ అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశారని ఆరోపించారు కేసీ వేణుగోపాల్. ఈసారి ఇండియా కూటమి ఆధ్వర్యంలోనే తాము ఎన్నికల్లోకి వెళతామని తెలిపారు.
Also Read : Bharat Nyay Yatra : మరో యాత్రకు రాహుల్ శ్రీకారం