KCR: బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్

బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్

KCR : ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. పార్టీ నాయకులతో బీఆర్ఎస్ అధినేత నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కవిత వ్యాఖ్యలపై సుధీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కవితను సస్పెండ్ చేస్తూ… పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు… పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ ఆరోపించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ క్రమంలో బీఆర్ఎస్ (BRS) పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ పార్టీ నేతలతో మరోసారి భేటీ అయ్యారు. కవిత సస్పెన్షన్‌‌ తరువాత పార్టీ తీసుకోవాల్సీన చర్యలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశంలో కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, సంజయ్‌, మాజీ ఎంపీ వినోద్‌లు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తరువాత బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. భేటీ అనంతరం బీఆర్ఎస్ నేతలు కవిత సస్పెన్షన్‌‌పై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

KCR – కాళేశ్వరంపై ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు ప్రభుత్వం సిఫారసు

కాళేశ్వరంపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు ఎన్‌డీఎస్‌ఏ గుర్తించిందని.. ప్రణాళిక, డిజైన్‌, నాణ్యత, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. అందుకే ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిటీ కూడా విచారణ జరిపి లోపాలను గుర్తించిందని తెలిపింది. ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై అసెంబ్లీలో చర్చించామని లేఖలో ప్రభుత్వం ప్రస్తావించింది. మరోవైపు రాష్ట్రానికి సీబీఐ రాకుండా గతంలో ఉన్న ఆదేశాలను సడలిస్తూ జీవో విడుదల చేసింది. సీబీఐ విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

Also Read : MLC Kavitha: బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌

Leave A Reply

Your Email Id will not be published!