KCR EX CM : జారి పడిన మాజీ సీఎం కేసీఆర్
యశోద ఆస్పత్రిలో చికిత్స
KCR EX CM : హైదరాబాద్ – నిన్నటి దాకా ఒక వెలుగు వెలిగిన , పదేళ్ల పాటు నిరంకుశ పాలన సాగించిన బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ కు కాలం కలిసి రావడం లేదు. తను ముచ్చటగా మూడోసారి సీఎంగా కొలువు తీరుదామని కన్న కలలు నిర్వీర్యమై పోయాయి. ఆయనకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆశించిన మెజారిటీ రాలేదు. ప్రత్యేకించి అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారాన్న ఆరోపణలు లేక పోలేదు.
KCR EX CM Fell Down
ఓ వైపు ప్రముఖ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ చేపట్టాలని కోరారు. ఇందులో బాధ్యులుగా మాజీ సీఎం కేసీఆర్(KCR) , తనయుడు మాజీ మంత్రి కేటీఆర్, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత, మాజీ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తో పాటు ఇంజనీర్లు, మేఘా కృష్ణా రెడ్డికి చెందిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు.
దీంతో ఉన్నట్టుండి మాజీ సీఎం కేసీఆర్ రాత్రి బాత్రూంలో జారి కింద పడ్డారు. ఆయనను హుటా హుటిన
యశోద ఆస్పత్రికి తరలించారు. అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read : Gade Innaiah : గాదె ఇన్నయ్యపై సీఎం ఫోకస్ ..?