KCR : ఒకరు దేశం కోసం 24 గంటల్లో కేవలం 2 గంటలే నిద్ర పోతున్నారట. ఆయనెవరో కాదు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ.
ఈ మాటలన్నది ఎవరో కాదు ఆ పార్టీకి చెందిన మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్. ఆయన ఇటీవల కొల్హాపూర్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ కామెంట్స్ చేశారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పాటిల్ కమెంట్స్ దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా ప్రధాన నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు.
రోజుకు కేవలం 2 గంటలు మాత్రమే నిద్ర పోవడం అన్నది దేశం కోసం కాదని అది విచిత్రమైన వ్యాధి అని, వెంటనే ప్రధానికి చూపించాలంటూ సెటైర్ విసిరారు.
ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విచిత్రం ఏమిటంటే రోజుకు కేవలం 3 గంటలు(KCR )మాత్రమే నిద్ర పోతున్నారని స్పష్టం చేశారు.
తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్నారంటూ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో మన ముఖ్యమంత్రి కృషి(KCR )చేస్తున్నారని కితాబు ఇచ్చారు.
ఆయన వల్లనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దేశంలో టాప్ లో నిలిచిందని అన్నారు. ఇక మంత్రి హనుమకొండలో మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మంత్రి ఈ కీలక కామెంట్స్ చేశారు.
Also Read : కరెంట్ ఛార్జీల పెంపుపై ‘బండి’ కన్నెర్ర