DH Srinivasa Rao : సీఎం కాళ్లు మొక్కితే తప్పేంటి – డీహెచ్
సమర్థించుకున్న శ్రీనివాసరావు
DH Srinivasa Rao : హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తాను చేసిన పనిని మరోసారి నిస్సిగ్గుగా సమర్థించుకున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు మహాత్మా గాంధీ అని ప్రశంసించారు. అంతే కాదు తాను కాళ్లు మొక్కిన విషయాన్ని కావాలని రాద్ధాంతం చేశారంటూ ఆరోపించారు.
తెలంగాణ అభివృద్ది కోసం అహర్నిశలు కృషి చేస్తున్న దొర కాళ్లు మొక్కితే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో తాను ఒక్కసారి కాదు వేయి సార్లు మొక్కుతానని స్పష్టం చేశారు శ్రీనివాసరావు(DH Srinivasa Rao). మున్నూరు కాపు కార్తీక వన మహోత్సవంలో డీహెచ్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నేను వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్నప్పటి నుంచి కేసీఆర్ పనితీరును గమనిస్తూ వస్తున్నా. కానీ మిగతా సీఎంల కంటే కేసీఆర్ చాలా డిఫరెంట్. వైద్య ఆరోగ్య శాఖలో ఊహించని విధంగా మార్పులు తీసుకు వచ్చారని కితాబు ఇచ్చారు. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ సమయంలో కొత్తగూడెంలో కూడా ఏర్పాటు చేయాలని సీఎంను కోరానని చెప్పారు. ఇక్కడ కూడా ఏర్పాటు చేసేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాను చెప్పడం సీఎం ఏర్పాటు చేయడంతో తాను కాళ్లు మొక్కాల్సి వచ్చిందని చెప్పారు.
మెడిసన్ చదువు కునేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఆ బాధలు ఇతరులు పడ కూడదనే తాను మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయమని కోరానన్నారు. తాను ఉద్వేగానికి లోనై కాళ్లు మొక్కానని ఒక్కసారి కాదు వేయిసార్లు కూడా మొక్కుతానని చెప్పారు శ్రీనివాసరావు(DH Srinivasa Rao).
ఆయన తెలంగాణ బాపు ..కాళ్లు మొక్కడంలో తప్పేమీ లేదన్నారు. ఇది నాకు తక్కిన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
Also Read : జయశంకర్ సార్ ఊరును విస్మరించిన కేసీఆర్