Kedarnath Temple: కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరిచిన సీఎం పుష్కర్ సింగ్ దామీ

కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరిచిన సీఎం పుష్కర్ సింగ్ దామీ

Kedarnath Temple : ఉత్తరాఖండ్‌ లోని ప్రముఖ ఆలయాల్లో కేదార్‌నాథ్ దేవాలయం ఒకటి. ఏటా కొన్ని రోజులు మాత్రమే ఈ ఆలయం తెరచి ఉంటుంది. మిగిలిన రోజులు మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కేదార్‌నాథ్ ద్వారాలు శుక్రవారం తెరుచుకున్నాయి. శుక్రవారం ఉదయం 7.00 గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య ఈ అలయం ద్వారాలను తెరిచారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రకరకాల పువ్వులతో అందంగా అలంకరించారు. స్వామి వారిని దర్శించుకోనేందుకు భారీగా భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో హెలికాఫ్టర్ ద్వారా భక్తులపై పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయాల(Kedarnath Temple) అధికారులు, కమిటీ సభ్యులు, పూజారులతోపాటు వేద పండితులు పాల్గొన్నారు.

Kedarnath Temple Opens…

చార్ ధామ్ యాత్రలో భాగంగా అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రిలను ఏప్రిల్ 30వ తేదీన తెరిచిన సంగతి తెలిసిందే. బద్రీనాథ్ దేవాలయం మాత్రం మే 4వ తేదీన తెరవనున్న సంగతి తెలిసిందే. అయితే కేదార్‌నాథ్ యాత్ర కోసం సోన్ ప్రయాగ్ నుంచి హెలికాఫ్టర్ సేవలు ఇప్పటికే ప్రారంభమైనాయి. ఇక కేదార్‌నాథ్‌కు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా… దేవాలయ అధికారులతోపాటు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇక జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేవాలయ పరిసర ప్రాంతాలలోనే కాకుండా… పలు చోట్ల భద్రతను పెంచారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకొకుండా భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కేదార్‌నాథ్ దేవాలయం తలుపులు తెరుచుకోవడంతో… చార్‌దామ్ యాత్రా దాదాపుగా ప్రారంభమైనట్లు అయింది. బద్రీనాథ్ దేవాలయం తలుపులు మరికొద్ది రోజుల్లో తెరుచుకోనుంది. దీనితో మరి కొద్ది రోజుల్లో ఈ యాత్రకు లక్షలాది మంది భక్తులు పోటెత్తనున్నారు.

Also Read : Deputy CM Pawan Kalyan: ఉపాధి హామీ శ్రామికులతో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ముఖాముఖి

Leave A Reply

Your Email Id will not be published!