Arvind Kejriwal : కేజ్రీవాల్ ఉగ్రవాది కాదు దేశ భక్తుడు
ఆప్ కు పట్టం కట్టిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్
Arvind Kejriwal : ఇవాళ దేశం యావత్తు ఉత్కంఠతో ఎదురు చూసింది. వాళ్లు ఊహించని రీతిలో బిగ్ షాక్ ఇస్తూ సామాన్యులు తమ తీర్పును ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం.
పాలకులు భవంతులకే పరిమితమై పోతే ఇలాంటి ఫలితాలే వస్తాయని స్పష్టం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). భారీ మెజారిటీతో పంజాబ్ లో దూసుకు పోతున్న తరుణంలో ఆయన ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలకు ముందు తనను టెర్రరిస్టుతో పోల్చారని, తన నిజాయితీని శంకించారని కానీ పంజాబ్ ప్రజలు తనపై , భగవంత్ మాన్ పై, ఆప్ పై ఎంతో నమ్మకంతో ఓటు వేసి అపూర్వ విజయాన్ని కట్ట బెట్టారంటూ తెలిపారు.
ప్రజలు తమపై అపారమైన ఆదరణను చూపించారని వారందరికీ పేరు పేరునా తాము ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నామని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు.
ఇది ఆప్ ప్రభుత్వం కాదని సామాన్యుల రాజ్యమని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఇది మార్పు కోసం..విప్లవం కోసం వేచి చూసిన సమయం. ఇది చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు.
మీ అందరినీ ఆప్ లో చేరాని తాను కోరుతున్నానని పేర్కొన్నారు సీఎం. ఆయన ఇవాళ ఢిల్లీలో మాట్లాడారు. కేజ్రీవాలు ఉగ్రవాది కాదు దేశ పుత్రుడు నిజమైన దేశ భక్తుడు అని చాటి చెప్పారని అన్నారు.
ఇవాళ సామాన్యులను పట్టించుకోని చరణ్ జిత్ సింగ్ చన్నీ, సిద్దూ, మజిథియాలను ఓడించారని అన్నారు.
Also Read : ప్రజా తీర్పు శిరోధార్యం – సిద్దూ